Telugu News

రూ.3కోట్లు చెల్లించాలి… రిక్షా కార్మికుడికి ఐటీ నోటీసు..

నోరేళ్లపెట్టిన కార్మికుడు.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు

0

రిక్షా కార్మికుడికి నోటీసులిచ్చిన ఐటీశాఖ 

రూ మూడు కోట్లు చెల్లించాలంటూ నోటీసులు

— నోరేళ్లబెట్టిన రిక్షా కార్మికుడు.. పోలీసులనుఆ శ్రయించి ఫిర్యాదు

(ఉత్తరప్రదేశ్ -విజయం న్యూస్)

రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసు జారీచేసింది.రూ.3 కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును చూసిన రిక్షా కార్మికుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో పోలీసులు ఆశ్రయించాడు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.
మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్‌ సింగ్‌ ఓ రిక్షా కార్మికుడు. బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ యేడాది 15న బకాల్‌పూర్‌లోని జన్‌ సువిధ కేంద్రంలో పాన్‌ కార్డు కోసం అప్లయ్‌ చేశాడు. కొన్ని రోజులకు సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి పాన్‌కార్డు కలర్‌ కాపీని ప్రతాప్‌ సింగ్‌కు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రకాశ్‌ సింగ్‌ అసలు కార్డుకు, కలర్‌ కాపీకి తేడా గుర్తించలేకపోయారు. కాగా, ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్‌ సింగ్‌కు నోటీసులు జారీచేశారు. తన జీఎస్టీ నంబర్‌తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు.అయితే తాను రిక్షా కార్మికుడినని చెప్పడంతో తన పాన్‌ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని ఐటీ అధికారులు సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ALSO READ :- హైదరాబాదులో దారుణం..బాలికపై బాలుడు లైంగికదాడి

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*