Telugu News

రికార్డు తిరగరాసిన కోహ్లి

ప్రపంచకప్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించిన కోహ్లి

0

రికార్డు తిరగరాసిన కోహ్లి

== ప్రపంచకప్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించిన కోహ్లి

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

భారత్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ క్రికెట్ మ్యాచ్ జరగ్గా, అందులో 64 పరుగులు చేసిన కోహ్లి అరుదైన రికార్డును నెలకొల్పారు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లి రికార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు శ్రీలంక బ్యాట్స్ మెన్ మహిళ జయవర్థనే పేరుతో ఉన్న 1063 పరుగుల రికార్డును కోహ్లి 1071 పరుగులు చేసి రికార్డును స్వంతం చేసుకున్నాడు. గత రెండేళ్ల నుంచి పరుగుల వేటకు దూరంగా ఉన్న కోహ్లి అతని పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో విమ్మర్శకుల నుంచి ప్రశంసలు అందుకునే విధంగా బ్యాటింగ్ శైలిని మార్చి గత కొద్ది రోజుల నుంచి పరుగుల వరదను స్రుష్టిస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఓటమి నుంచి తప్పించి గెలిపించిన విరాట్ కోహ్లి ఆయన విరావిహారం మనమంతా చూసిందే.. శాశ్వత ప్రత్యర్థి పాకిస్తాన్ పై తన బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించి భారత్ జాతికి గౌరవం పెంచిన సంగతి తెలిసింది.

allso read- బంగ్లాపై భారత్ ఘనవిజయం