***పాలేరులో విద్యుధాఘాతంతో రైతు మృతి
***మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్
***పాలేరులో విషాదఛాయల
***(కూసుమంచి-విజయం న్యూస్):-
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో విషాదం నెలకొంది.. మోటర్ ఆన్ చేసేందుకు ప్రయత్నించిన రైతుకు కరెంట్ షాక్ తగలడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామానికి చెందిన బండ్ల వెంకట్ రెడ్డి (50) వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన వ్యవసాయ పంటకు నీళ్ళు పట్టెందుకు గురువారం తెల్లవారుజామున మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుధాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
also read :-బయ్యారంలో భగ్గుమన్న ఉక్కు దీక్ష…!
ఇంటివద్ద ఇంకా రాలేధని కుటుంబసభ్యులు అనుమానంతో వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్ళగా వెంకట్ రెడ్డి కిందపడి ఉండటంతో కుటుంబ సభ్యులు చూసి బోరుమన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.. సంఘటన తెలుసుకున్న కూసుమంచి ఎస్ఐ నంధీఫ్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలంకు చేరుకుని వివరాలను సేకరించారు. కాగా కుటుంబసభ్యుల పిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షకు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.