Telugu News

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకొవాలి…!

జిల్లా కలెక్టర్ కె. శశాంక.

0

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకొవాలి…!

జిల్లా కలెక్టర్ కె. శశాంక.

(మహబూబాబాద్- విజయం న్యూస్)

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీలలో జిల్లా కలెక్టర్ పాల్గొని పోటీలను ప్రారంభించిన అనంతరం పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించి, వాలీబాల్, క్రికెట్ ఆటలు ఆడి ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం నింపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ, క్రీడలు అంటే అందరికీ ఇష్టమే కానీ ఆడే అవకాశం తక్కువ సందర్భాలలో వస్తుందని, ఆ అవకాశం ఉద్యోగులకు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, తక్కువ సమయంలో ఉద్యోగుల నుండి విశేష స్పందన వచ్చిందని, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

also read :-నువ్వు బత్తాయివో.. వంకాయవో.. ప్రజలకు తెలుసు..

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత మనం అంతకు ముందు ఆడిన ఆటలను, మన హాబీ లను, అలవాట్లను మరిచిపోయామని, మనల్ని మనం క్రొత్తగా ఆవిష్కరించుకునే, గుర్తింపు పొందే అవకాశం అని తెలిపారు.పోటీల నిర్వహణ తో ఉద్యోగుల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం తో భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా తమ విధులు నిర్వహించుకునే అవకాశం ఉన్నదని, జిల్లా ఉద్యోగులు సమన్వయంగా పోటీల్లో పాల్గొనడం సంతోషమని, ఈ పోటీల తో ఉద్యోగుల లో మంచి వాతావరణం కల్పించినట్లు అవుతున్నదని, దైనందిన జీవితంలో క్రీడలు భాగం చేసుకొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని తెలిపారు.అన్ని శాఖల ఉద్యోగులు సమిష్టిగా ఆడి నైపుణ్యం పెంపొందించుకుని భవిష్యత్తులో పోలీస్ టీమ్ తో కలిసి ఆడే విధంగా, క్రీడా స్ఫూర్తితో ధీటుగా ఎదుర్కొనే విధంగా జట్లు ఉండాలని తెలిపారు.మార్చ్ ఫాస్ట్ నుండి చివరి ఫైనల్ వరకు అన్ని పోటీలలో ప్రదర్శనను కలిపి వేయిటేజ్ ఇచ్చి ఓవరాల్ ఛాంపియన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

also read :-ఖమ్మం అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కుట్ర..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, డి.ఎఫ్. ఓ. రవికిరణ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం లు ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు.అంతకుముందు, జిల్లా కలెక్టర్ ను బ్యాండ్ ట్రూప్ తో సభాస్థలి వరకు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించగా, (12) టీములు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతిని క్రీడాకారులు వెలిగించి స్టేడియం లో జిల్లా కలెక్టర్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, డి.ఎఫ్. ఓ. రవి కిరణ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం, ఆర్డీవో కొమురయ్య, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.