Telugu News

కన్నీరు పెట్టించిన “జరుగుతున్న కథ”నాటిక

--నెల నెలా వెన్నెల కార్యక్రమం పున:ప్రారంభం

0

కన్నీరు పెట్టించిన “జరుగుతున్న కథ”నాటిక

–నెల నెలా వెన్నెల కార్యక్రమం పున:ప్రారంభం
(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం నగరం లోని భక్త రామదాసు కళాక్షేత్రం లో నిర్వహించిన నెల నెలా వెన్నెల కార్యక్రమం ఎంతగానో ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది.కుమారి మీనా నృత్య ప్రదర్శన జానపద గీతాలు ఆకట్టుకున్నాయి.”కన్నీరు పెట్టించిన కథ ” అలరించాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు జరిగిన నెల నెలా వెన్నెల పుణ: ప్రారంభ కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి నాగబత్తిని మాలతీ , రవీంద్రనాథ్ లకు పూల మాలలు వేసి సభ ప్రారంభించారు.

also read;-గ్రామీణ వైద్యుల సమస్యకు త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం.. మంత్రి పువ్వాడ.

సభకు ముందు ఈ రెండు సంవత్సరాల కాలంలో మరణించిన కళాకారులు, ప్రముఖులు జయప్రకాష్ రెడ్డి , రాళ్లపల్లి, వైజాగ్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, బాలసుభ్రమణ్యం, లతా మంగేష్కర్ , కందికొండ, నిసార్, సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం , ప్రేక్షులలో ఈ కాలంలో మరణించిన వారి అందరికీ మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథి రవిమారుత్, దేవేంద్ర డాక్టర్ నాగబాత్తిని రవి లు ప్రసంగించారు. ప్రముఖ రంగస్థల నటులు గంగోత్రి సాయి నీ రంగస్థల దినోత్సవం సందర్భంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్ ఎస్ కుమార్, వి.వి అప్పారావు, మోటమర్రి జగన్మోహన్ రావు , వేముల సదానంద, నామ లక్ష్మి నారాయణ, జె. పాపారావు, కొండలు, తదితరులు పాల్గొన్నారు.