Telugu News

దక్షణాఫ్రికాపై ఇండియా తొలిటెస్ట్ విజయం

== సెంచురియన్ టెస్ట్ లో భారత్ రికార్డు

0

దక్షణాఫ్రికాపై ఇండియా తొలిటెస్ట్ విజయం
== సెంచురియన్ టెస్ట్ లో భారత్ రికార్డు
== మ్యాన్ ఆప్ ది మ్యాచ్ గా కెఎల్ రాహుల్
(సెంచూరియన్, హైదరాబాద్ –విజయంన్యూస్)
సెంచూరియన్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 305 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ అడిన దక్షిణాప్రికాను 191 పరుగలకే భారత్ బౌలర్లు ఆవుట్ చేశారు. దీంతో 113 పరుగు తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 అధిక్య సంపాధించింది. దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్ లలో ఎల్లర్(77), బవుమా(35), డికాక్ (21) తప్ప మిగతా వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లు బుమ్రా, షమీ, చేరో 3 వికేట్లు సాధించగా, సిరాజ్, అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో సెచరీ సాధించి టీమిడియాను పటిష్ట స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

తొలి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 123 పరుగులు చేశాడు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులకు అలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ 197 పరుగులకే అలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగలకే అలౌట్ కాగా, 305 పరుగుల టార్గెట్ విధించగా, లక్ష్యం కోసం రంగంలోకి దిగిన దక్షిణాప్రికా చాలా తక్కువ స్కోర్ చేయడంతో 113 స్కోర్ తేడాతో ఇండియా విజయం సాధించింది. కాగా సెంచూరియన్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి టెస్టు విజయం కావడం గమనర్హం. 94 పరుగల స్కోర్ తో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు 191 పరుగులకే కుప్పకూలిపోయింది. సఫారి టీమ్ నుంచి ఎనిగిడి 6 వికెట్లు, రబాడ 3 వికేట్లు తీసి వెన్ను విరవగా, భారత్ బౌలర్లు కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. మహ్మద్ షమీ 5 వికెట్లు, శార్దూల్ 2 వికెట్లు, బుమ్రా, సిరాజ్ చేరో వికెట్ తీసి టీమిండియాకు గ్రాండ్ విక్టరీ అందించారు.

also read :-*నగరాభివృద్ధే నా లక్ష్యం: మంత్రి పువ్వాడ