Telugu News

విశ్వ విజేత ఆసిస్. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆస్ట్రేలియా.

8 వికెట్ల తేడాతో కివీస్ పై ఆస్ట్రేలియా గెలుపు.

0

విశ్వ విజేత ఆసిస్.

తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆస్ట్రేలియా.

8 వికెట్ల తేడాతో కివీస్ పై ఆస్ట్రేలియా గెలుపు.

వీరవిహారం చేసిన మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌.

కేన్‌ విలియమ్సన్‌ సూపర్ ఇన్నింగ్స్ వృధా.

( విజయం న్యూస్) : –

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ 2021లో చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి న్యూజిలాండ్ తో ఫైనల్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో కొత్త చాంపియన్ గా నిలిచింది.ఎట్టకేలకు ఆస్ట్రేలియా నిరీక్షణకు తెరపడింది. 5 సార్లు వన్డే ప్రపంచకప్‌ సొంతం చేసుకున్నప్పటికీ అందని ద్రాక్షలా ఊరించిన పొట్టి కప్పును ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొత్త చాంపియన్ గా అవతరించింది.

కివీస్‌ కు.. ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కాగా, ఆసీస్‌కి రెండో ఫైనల్‌ 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈసారి మాత్రం ట్రోఫీని చేజారనివ్వలేదు. ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌(77), డేవిడ్‌ వార్నర్‌(53) వీరవిహారం చేశారు. దీంతో ఆజట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్ ఫించ్ బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లకు కేవలం 57 పరుగులు సాధించిన కివీస్‌.. ఆఖరి పది ఓవర్లలో 115 పరుగులు రాబట్టింది.

ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ (4 ఓవర్లలో 60) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మిచెల్‌ (8 బంతుల్లో 11: ఒక సిక్స్‌) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే   ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌తో. కలిసి మార్టిన్‌ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ ఆసీస్‌ ఫీల్డర్‌ స్టాయినిస్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్స్ (18:ఒక ఫోర్, ఒక సిక్స్)తో కలిసి కేన్‌ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు.

ఈ క్రమంలో .కెరీర్‌లో 14వ అర్ధశతకం నమోదు చేశాడు. ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో. టీ20ల్లో. కేన్‌ విలియమ్సన్‌. తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో. బౌండరీ లైన్‌ వద్ద స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లలో సీఫర్ట్‌ (8*), నీషమ్‌ (13*) బ్యాటింగ్‌తో .కివీస్‌ స్కోరు 170 పరుగులు దాటింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్‌ తీశారు..

also read ;- జై భీమ్ ‘‘సినతల్లి’’ పేర బ్యాంకులో రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన హీరో సూర్య.