Telugu News

బడా దోస్త్ i2 లాంచింగ్

0

ఖమ్మం డీలర్ వెంకటేశ్వర ఆటో మోటార్స్ బడా దోస్త్ i2 లాంచింగ్ ను మంగళ వారం లాంచ్ చేసారు. ఈ సందర్భంగా హెడ్ ఆపరేషన్ విశ్వనాధ్, అశోక్ లేయలాండ్ టీ ఎస్ ఎం, అంకిత్, షోరూం మేనేజర్ శ్రీనివాస్, రాజు, సీనియర్ ఎక్జిక్యూటివ్ గోవర్ధన్,సీనియర్ ఎక్జిక్యూటివ్లు జాన్బీ గారు మాట్లాడుతూ.అశోక్ లేలాండ్ బడా దోస్త్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్న 1478 సిసి ఇంజిన్‌తో శక్తిని పొందిందని అన్నారు. ఇది 40 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 5-స్పీడ్ గేర్ బాక్స్ మరియు BS-VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా డీజిల్ వెర్షన్‌లో లభిస్తుందని తెలిపారు. డెక్ బాడీ ఎంపికలో డే క్యాబిన్‌తో అందుబాటులో ఉందని అన్నారు. వీల్‌బేస్ మరియు జీ వి డబ్లూ వరుసగా 2510 mm & 2880 kg అని చెప్పారు. ఇది పవర్ స్టీరింగ్, D+2, డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్‌లు & మరిన్ని వంటి విభిన్న లక్షణాలను కూడా అందిస్తుందనితెలిపారు.