Telugu News

తప్పించుకున్న నలుగులు బాలురు … పట్టుకున్న కూసుమంచి పోలీసులు..

0

బీహార్ కు చెందిన రషద్, తుపిక్, తన్వీర్, అస్సాంకు చెందిన పింటులు గత కొద్ది నెలల క్రితం వారి రాష్ట్రాల నుంచి ట్రైన్ లో రాగా అక్కడ పోలీసులు పట్టుకుని హాస్టల్ అధికారులకు అప్పగించారు.. వారు అడ్రస్ వివరాలు చెప్పకపోవడంతో హాస్టల్ లో ఉంచారు.. అయితే వారంరోజుల క్రితం ఆ హాస్టల్ నుంచి పారిపోయి ట్రైన్ లో ఖమ్మం రాగా రైల్వే పోలీసులు పట్టుకుని సీడబ్య్లూసీ అధికారికి అప్పగించారు. కాగా ఆమె కూసుమంచిలోని జెస్సీ హాస్టల్ కు పంపించగా వారంరోజుల నుంచి హాస్టల్ లో ఉంటున్నారు..

అయితే సోమవారం ఉదయం 11గంటలకు హాస్టల్ నుంచి పారిపోయారు.. దీంతో జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య,కొక్కిరేణి రమేష్ లు గ్రూపులో పార్వోడ్ చేయగా కూసుమంచి శివారు నర్సరీ సమీపంలో రోడ్డు వారిగా నడుసుకుంటూ వెళ్తున్నా ఆ నలుగుర్ని కూసుమంచి హైస్కూల్ కు ఉపాధ్యాయుడు శోభన్ గారు చూసి వారిని ఆపే ప్రయత్నం చేయగా పరారైయ్యారు. ఈ విషయాన్ని వెంటనే పెండ్ర అంజయ్యకు కాల్ చేయగా వెంటనే కూసుమంచి ఎస్ఐ నందీఫ్ గారి కి సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్ఐ వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించగావారు అప్పటికే పారిపోవడంతో ఎస్ఐ చుట్టుపక్కల గ్రామాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో ముగ్గురు ఎస్ఐకి దొరకగా, పింటు అనే బాలుడు పరారైయ్యాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు..