నగర కార్పోరేషన్ అంబాసిడర్ లుగా వనజీవి
%% స్వచ్ఛత నగరంగా నిలపటానికి అందరం కలిసి పనిచేద్దాం
(ఖమ్మం నగరం-విజయంన్యూస్)
పద్మశ్రీ అవార్డు గ్రహిత, మొక్కలను పెంచండి.. మానవ మనుగడను కాపాడండి అంటూ వక్షో రక్షతి రక్షత నినాదంతో లక్షలాధి మొక్కలను పెంచి యావత్తు దేశానికే ఆదర్శనీయుడిగా పేరుగాంచిన వనజీవి రామయ్యను ఖమ్మం కార్పోరేషన్ బ్రాండ్ అంబాసీడర్ నియమించింది. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అలాగే మిసెస్ .ఇండియా ఫోటోజెనిక్ 2021 , జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత మహమ్మద్ ఫర్హాను నగర కార్పోరేషన్ నియమించింది. ఈ మేరకు ఉత్తర్హులను మున్సిపల్ కమీషనర్ అదర్శ్ సురబీ హాజరైయ్యారు.
also read :-రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 ద్వారా పట్టణ ప్రజలకు స్వచ్ఛతపై…తడి , పొడి, హానికలిగించే ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం కార్పోరేషన్ బ్రాండ్ అంబాసిడర్ లుగా పద్మశ్రీ వనజీవి రామయ్య, మిసెస్ .ఇండియా ఫోటోజెనిక్ 2021 , జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత మహమ్మద్ ఫర్హాను నగర కార్పోరేషన్ నియమించింది. ఇందులో భాగంగా గురువారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశమందిరంలో నగర మేయర్ పీ.నీరజ , కమిషనర్ ఆదర్శ్ సురభి ఐఏఎస్ లు వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా తడి , పొడి, హానికరమైనచెత్త, హోమ్ కంపోస్టింగ్. పచ్చదనం-పరిశుభ్రత , ప్లాస్టిక్ బ్యాన్, సఫాయి మిత్రకు సంబంధించిన పోస్టర్స్ లను ఆవిష్కరించారు.
also read :-మేడారం జాతర విజయవంతానికి అందరూ సహకరించాలి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛ నగరంగా అవార్డు గెలుపు ఆకాంక్షిస్తూ మనమందరం స్వచ్ఛతకు పాటుపడతామని, స్వచ్ఛమైన నగరంగా ఖమ్మం పట్టణాన్ని జాతీయ స్థాయిలో నిలపటానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఖమ్మం నగరంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో స్వచ్ఛతలో అగ్రస్థానం సాధించాలని కోరారు. స్వచ్ఛ ఖమ్మంకు ప్రతి ఒక్కరు సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా , అసిస్టెంట్ కమిషనర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు…