♦️వన నర్సరీలను పరిశీలించిన కలెక్టర్ సీక్తా పట్నాయక్
♦️ మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
(ఇచ్చోడ విజయం న్యూస్) :-
వన నర్సరీలలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వహకులు అధికారులు జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సీక్తా పట్నాయక్ అన్నారు . ఇచ్చోడ మండంలోని ఇస్లాంనగర్, సాథ్ నంబర్ గ్రామాలలోని వన నర్సరీలను ఆమె పరీశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలోని వన నర్సరీలలో పెంచుతున్న మొక్కల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
also red :-కృతి శెట్టి కోరిక తీరేదెప్పుడో..?
వేసవి తీవ్రతతో మొక్కలు ఎండి పోకుండా వన నర్సరీల పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జూన్ మాసంలో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి మొక్కలను అందించడానికి సిద్ధం చేయాలన్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని నర్సరీల్లో మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో నీరు పోసి సంరక్షించాలన్నారు. అనంతరం సాథ్ నంబర్ గ్రామాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధి హామీ పథకం పనులను సక్రమంగా చేయించి అతి త్వరలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎంపిటిసి గాడ్గే సుభాష్,సర్పంచ్ గాడ్గే మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.