Telugu News

కల్లుగీత కత్తితో యువతి మెడ కోసిన యువకుడు

నస్పూర్- విజయంన్యూస్

0

కల్లుగీత కత్తితో యువతి మెడ కోసిన యువకుడు

( నస్పూర్- విజయంన్యూస్);-

యువతిపై కల్లుగీత కత్తితో దాడి చేసిన మెడ కోసిన సంఘటన సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరు నస్పూర్ లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది ఎస్ఐ.టి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం….మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం బొఠ్ఠలగుట్ట గ్రామానికి చెందిన యువతి(21) నస్పూర్ లోని తమ బంధువుల ఇంటికి నూతన గృహప్రవేశానికి వచ్చిందని,

also read :-దామెర మండలం పసరగొండ గ్రామంలో భర్త మెడ కోసిన భార్య

కార్యక్రమం ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరే క్రమంలో ఆటో ఎక్కుతుండగా 3.30 గంటల సమయంలో ఆటో ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన నస్పూర్ గ్రామానికి చెందిన గడ్డం సాయికిరణ్ కల్లుగీత కత్తితో ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించగా గమనించిన యువతి తండ్రి, బంధువులు అతన్ని దూరంగా నెట్టివేయగా ఈ క్రమంలో అతని చేతిలోని కత్తి ఆమె మెడపై కోసుకోసుకు పోయి గాయం కావడంతో వెంటనే బంధువులు ఆమెను ఆటోలో మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగ ఉందని . యువతి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.