Telugu News

పేకాట స్థావరం పై సిసిసి నస్పూర్ పోలీసుల ఆకస్మిక దాడి

పేకాట స్థావరం పై సిసిసి నస్పూర్ పోలీసుల ఆకస్మిక దాడి

0

 పేకాట స్థావరం పై సిసిసి నస్పూర్ పోలీసుల ఆకస్మిక దాడి

—-06 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్…పరారిలో మరో ఇద్దరు

—–6230 వేల రూపాయల నగదు,03 ఆటోలు,01 బైక్ స్వాధీనం

(నస్పూర్ పోలీస్ కమిషనరేట్ – విజయం న్యూస్);-

సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపల్లి గ్రామశివారులో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడే ఉన్న ఆరుగురు ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6230 రూపాయల నగదు, పేకాట ముక్కలను, 03 ఆటోలు,01 బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసుల రాక ను గమనించి ఇద్దరు పారిపోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.

పట్టుబడిన వారి వివరాలు

Al) జాడి బానేష్ S/o లింగయ్య , 29 Yrs, నేతకానీ , R/o; కూలీ , R/o; సీతారాంపల్లి ,

A2) మార్కాపూరి శ్రీనివాస్ S/o రాంచంద్రయ్య , 35 yrs, అయ్యాల్వర్ , ఆటో డ్రైవర్ , R/o; H.No. 4-73, సీతారాంపల్లి ,

A3) బోపు శేఖర్ S/o బాలయ్య , 40 yrs, P-Shali, ఆటో డ్రైవర్ , R/o; విలేజ్ శ్రీరాంపూర్ ,

A4) పెద్దిరాజు వివేక్ S/o సురేష్ , 40 yrs, P- శాలి , ప్రైవేట్ జాబ్, R/o; జన్మభూమి నగర్ , మంచిర్యాల ,

A5) బోడకుంట రాజమొగిలి S/o లక్ష్మయ్య , 40 yrs, పెరిక , ఆటో డ్రైవర్ , R/o; విలేజ్ శ్రీరాంపూర్ ,

A6) శాతం రాజు S/o అతలు , 45-Yrs, తెనుగు , ఫిష్ బిజినెస్ , R/o; విలేజ్ శ్రీరాంపూర్

పరారిలో ఉన్న నిందితులు

A7) సాయి R/o విలేజ్ శ్రీరాంపూర్

A8) జాడి సతీష్ R/o సీతారాంపల్లి

ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ…… తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాట బానిసలుగా మారుతున్నారు అని అప్పుల పాలవుతున్న కుటుంబలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారు వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇట్టి టాస్క్ లో ఎస్ఐ వెంట Asi జితేందర్, సత్తయ్య, పీసి లు రవి, రాజబాబు ఉన్నారు.