Telugu News

పశువులకు ప్రాణసంకటంగా మరిన డంపింగ్ యార్డు

రెండు పశువులు చనిపోయయి వాటి విలువ సుమారు 60000 రూపాయలు

0

పశువులకు ప్రాణసంకటంగా మరిన డంపింగ్ యార్డు
♦️ రెండు పశువులు చనిపోయయి వాటి విలువ సుమారు 60000 రూపాయలు

♦️ డంపింగ్ యార్డ్ లో వచ్చి తింటు ప్రాణాలు పోతున్నాయి

♦️ పట్టించుకోని పంచాయతీ అధికారులు

(ఇచ్చోడ విజయం న్యూస్) :-

ఇచ్చోడ మండలం జున్ని గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో సిబ్బంది సేకరించిన చెత్తను వాహనాలతో డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ఈ చెత్త లో అనేక కలుషితమైన, విషపూరితమైన పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, కూడి ఉంటాయి. డంపింగ్ యార్డ్ చుట్టూ ఎలాంటి పెంస్సింగ్ ఏర్పాటు వలయం చెయ్యలేదు. దీంతో పశువులు గేదెలకు సరైన మేత, నీళ్లు దొరకక అల్లాడుతున్నాయి. కొంత మేరకైనా నేత దొరుకుతుందెమో అని ఆ మూగ జీవులు డంపింగ్ యాడ్ కు వెళ్లి దొరికిన మేతను తింటున్నాయి. డంపింగ్ యార్డ్ చుట్టూ ఎలాంటి కంచెలు ఏర్పాటు చేయకపోవడం వల్ల పశువులు చొరబడి వాటిని తింటున్నాయి.

also read :-ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో అలజడి సృష్టించారు..

దీంతో అనేక పశువులు ప్రతిరోజు రోగలు బారిన పడుతూ మరణిస్తూనే ఉన్నాయి. అనేక మంది పేద ప్రజలు, రైతులు పాడి పశువులను తెంచుకొని ఉపాధిని పొందుతున్నారు. ఈ వేసవి కాలంలో పశువులు, గేదెలకు మేత దొరకక పోవడం వల్ల రైతులు పశుకాపరులు పశువులను బయటకు విడిచి పెట్టడం వల్ల అవి చెత్త డంపింగ్ యార్డ్ లకు వెళ్లి ఈ విషపూరితమైన మేతను తింటున్నాయి. ఈ డంపింగ్ యార్డుకు సేకరించి చెత్తను ప్రతిరోజు తరలించి నిల్వ చేస్తున్నారు. దీంతో అటు వైపు వందలాది పశువులు వెళ్తుంటాయి. ఇటీవల అనేక పశువులు మృతి చెందినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. చెత్త డంపింగ్ యార్డ్ చుట్టూ పెంస్సింగ్ వలయం ఏర్పాటు చెసి ఓ పశువుల కాపరిని నియమించాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.