Telugu News

10 సంవత్సరాల నుంచి సంతానం లేదని ఆత్మహత్య

ఇచ్చోడ విజయం న్యూస్

0

10 సంవత్సరాల నుంచి సంతానం లేదని ఆత్మహత్య

(ఇచ్చోడ విజయం న్యూస్) :-

ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉట్నూర్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మాడ్నే చంద్రకాంత్ 35 డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తన భార్య సువర్ణతో కలిసి మండల కేంద్రంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు.

also read :-జితేందర్ రెడ్డి సేవలు మరవలేనివి

పెళ్లై 10 సంవత్సరాలైన ఇంకా పిల్లలు కావడం లేదని తీవ్ర మనస్తాపం చెందే వాడని భార్యాభర్తల అప్పుడప్పుడు గొడవ పడేవారని అయితే ఆదివారం ఉదయం 5 గంటలకు తన తమ్ముడు గాడ్నే గునేష్ కు ఫోన్ చేసి తనకు ఇంకా పిల్లలు కలగడం లేదని బాధపడుతూ ఫోన్ చేసి రమ్మన్నాడు. తన తల్లిదండ్రులను తీసుకొని వచ్చి చూడగా అద్దె ఇంటి లోని బెడ్ రూమ్ లోని వెంటి లెటర్ కిటికీకి ఉరి వేసుకొని ఉన్నాడు.మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.