Telugu News

‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి

0

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో దేవాకట్టా బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.. ట్రైలర్ ను విడుదల చేసిన చిరు..  ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష’ అంటూ..  ట్వీట్ కూడా చేశారు. 

also read : ఏడేళ్ళు గడిచిన స్వంత క్యాడర్ లేని టి.అర్.ఎస్