Telugu News

సాయ‌మందిస్తే దేశ ద్రోహుల‌వుతారా..?

బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఫైర్..

0

సాయ‌మందిస్తే దేశ ద్రోహుల‌వుతారా..?
బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఫైర్..

తెలంగాణ బీజేపీ నాయ‌కుల వ్యాఖ్య‌ల‌పై.
మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చేసిన పోరాటంలో చ‌నిపోయిన 750 మంది రైతు కుటుంబాల‌కు ఆర్థిక‌ సాయం చేస్తాన‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఖ‌లీస్తాన్‌ల‌కు(రైతుల‌ను ఉద్దేశించి) ఆర్థిక సాయం చేస్తున్న దేశ ద్రోహి అని బీజేపీ నాయ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను మంత్రి కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. సంవ‌త్స‌రం పాటు రైతుల ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకోని వారు దేశ‌భ‌క్తులా..? మృతి చెందిన రైతు కుటుంబాల‌కు సాయం చేయ‌ని వారు దేశభ‌క్తులా..? రైతు కుటుంబాల‌కు సాయం అందించిన వారు దేశ ద్రోహులవుతారా..? దేశ‌భ‌క్తిపై స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి ఈ మూర్ఖులు ఎవ‌రు? అని కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. also read :- సాయ‌మందిస్తే దేశ ద్రోహుల‌వుతారా..?