Telugu News

▪️ మూడోసారి కేసీఆర్ కి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.: లింగాల కమల్ రాజు

▪️ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో TRS కి ప్రజలు ఏకపక్ష ఫలితాలు ఇచ్చారు

0

▪️ మూడోసారి కేసీఆర్ కి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.: లింగాల కమల్ రాజు

▪️ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో TRS కి ప్రజలు ఏకపక్ష ఫలితాలు ఇచ్చారు

▪️ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా TRS పార్టీ ఎదుగుతుంది

▪️ మధిర నియోజకవర్గ ప్రజలు TRS వైపే ఉన్నారు

▪️ బూటకపు పాదయాత్రలో భట్టి ఎన్నో నాటక ప్రదర్శనలు చేస్తున్నారు.

➖ విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
(ముదిగొండ  విజయం న్యూస్):-

మధిర నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ప్రజలను , అభివృద్ధి గాలికి వదిలేసి హైదరాబాద్ లో ఉంటూ రాష్ట్ర నాయకుడి గా తిరుగుతూ ఎన్నికల సమయం ఆసన్నమైందని వచ్చి పాదయాత్ర పేరుతో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కొత్త నాటకం మొదలు పెట్టారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు విమర్శించారు..

also read :-మేలుకుంటే కోలుకుంటాం

శనివారం నాడు ముదిగొండ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మధిర మున్సిపల్ ఎన్నికల్లో సింగల్ గా మున్సిపాలిటీ ని కైవసం చేసుకోవడం జరిగిందని అలానే నియోజకవర్గ పరిధిలో 24 సహకార సంఘాలు ఉంటే ఒంటరిగా 16 సంఘాలను TRS పార్టీ గెలుచుకుందని తెలిపారు అలానే జరిగిన అన్ని ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ప్రజలు TRS వైపే ఉన్నారని మిగిలిన పార్టీలు అన్ని కలసిన తమ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారని ఆయన గుర్తు చేశారు..అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశామని ప్రజలు గుర్తించి తర్వాత వరుస విజయాలను TRS కి ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు.. రానున్న కాలంలో మధిర ప్రజల మద్దతు తో నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా TRS పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు..

also read :-జనవరి నాటికి వచ్చింది రూ.85,378.59 కోట్లు

పార్టీ ఎదుగుదల చూసి ఓటమి భయంతో భట్టి విక్రమార్క పాదయాత్ర నాటకం మొదలు పెట్టారని దానిని ఆదిలోనే ముదిగొండ మండల TRS పార్టీ నాయకత్వం ప్రజల సహకారంతో సమర్ధవంతంగా తిప్పికొట్టారని తెలిపారు.. మండలంలో ఒక పక్క పాదయాత్ర చేస్తుంటే మరో పక్క TRS లోకి కాంగ్రెస్ ఇతర పార్టీల నుండి చేరికలు జైత్రయాత్ర సాగుతుందని అన్నారు…పాదయాత్ర కి ప్రజల నుండి స్పందన కనబడకపోవడంతో పేమెంట్ బ్యాచ్ తో పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. గతంలో ఏనాడు లేని విధంగా పాదయాత్ర లో నాటక ప్రదర్శనలు చేస్తున్నారని ఇన్ని ఏళ్లుగా ఏనాడు ప్రజల దగ్గరకు వేళ్ళని భట్టి కొత్తగా గీత కార్మికుల దగ్గరకు వెళ్లి కల్లు తాగడం, మిర్చి కల్లం దగ్గర వెళ్లి వారితో మాట్లాడడం వంటి నటనలు బాగా చేస్తున్నారని విమర్శించారు..

also read :-*ఉక్కు కర్మాగారం స్థాపించాల్సిందే: కూనంనేని

ఎమ్మెల్యే గా గెలిచి ఇన్ని ఏళ్ళు కనపడకుండా హైదరాబాద్ లో ఉంటూ కరోనా ఆపత్కాలం లో కూడా కనీసం నియోజకవర్గం వైపు తిరిగి కూడా చూడని భట్టి ఒక్కసారిగా వచ్చి పాదయాత్ర చేయడం వెనుక ఉన్న మర్మమేమిటి అని ఆయన ప్రశ్నించారు..కేంద్రం చేసే వాటిని రాష్ట్ర ప్రభుత్వం పై నెడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేది కేంద్ర ప్రభుత్వం అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం పై నెడుతూ బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు బిడ్డ డెలివరీ కాకపోతే అత్త అల్లుడు మీద పడి ఏడ్చింది అనే సామెత చందంగా జాతీయ పార్టీ అయి ఉండి కేంద్రం పై పోరాటం చేయలేక రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారని ఆరోపించారు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 200 రూపాయల పెన్షన్లు 2000 రూపాయలకు పెంచి ప్రభుత్వం అందిస్తుంటే వచ్చిన పెన్షన్లు సారా తాగే వాళ్ళ రూపంలో తీసుకుంటున్నారని తప్పుడు లెక్కల తో గ్లోబెల్ ప్రచారం చేయడం లో అర్ధం లేదని సారా తాగే వాళ్లకు పెన్షన్లు తీసుకునే వాళ్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు..ఏ రోజు మధిర నియోజకవర్గ ప్రజల సంక్షేమం గురించి కానీ, నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మాట్లాడని, ఆలోచించని భట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు చేస్తుంటే TRS కి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గా భట్టి కాళ్ళు అడ్డం పెడుతున్నారని పేర్కొన్నారు..గతంలో కమిషన్ ఇవ్వలేదని మండలం లో పండ్రేగిపల్లి రోడ్డు పనులు అడ్డుకున్న చరిత్ర భట్టిదే అన్నారు..

పక్కన నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి సహా ఎమ్మెల్యేలు అందరూ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఆడబిడ్డలకు చీరలు పెట్టి అందిస్తుంటే మధిర నియోజకవర్గంలో మేము గొడవ చేస్తే తప్ప వచ్చి ఇచ్చేవారు కాదని అలాంటిది ఇప్పుడు పాదయాత్ర కేవలం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే అన్నారు.. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధి ఇప్పుడే ప్రజలకు అందుతుందని ఎప్పుడో 2030 తర్వాత అందే కాంగ్రెస్ ప్రభుత్వం లో పెట్టిన బంగారు తల్లి పథకాన్ని దీనికి పోలికే లేదన్నారు.. రాని బంగారు తల్లి గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల మందికి రూ.10 వేల కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ద్వారా అందించామని భవిష్యత్ లో ఇంకా మరింత మందికి ఇస్తామన్నారు..రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గారికి మూడోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మధిర ప్రజలు కూడా TRS వైపు చూస్తున్నారని ఇక బూటకపు పాదయాత్ర లు మానుకోవాలని ఆయన హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

please subscribe this chanel smiling chaithu;-