Telugu News

◆ దేశానికే దిక్సూచిగా “రైతుబంధు” కార్యక్రమం.

తు బాంధవుడు కేసీఆర్

0

తు బాంధవుడు కేసీఆర్
◆ దేశానికే దిక్సూచిగా “రైతుబంధు” కార్యక్రమం.
◆ 8వ విడత రైతు బంధు డబ్బులు రైతు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
◆ రైతు బంధుతో 50వేల కోట్ల నగదు రైతులకు సాయంగా అందజేసిన ఘనత కేసీఆర్ దే.
◆ ఖమ్మం జిల్లాలో 3.16 లక్షల మంది రైతులకు గాను రూ.362.84 కోట్లు జమ.
◆ రైతుల పక్షాన కేసీఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
== రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్)
రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు, రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజయం పత్రిక ప్రతినిధితో మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద దేశానికే దిక్సూచిగా “రైతుబంధు” కార్యక్రమం అమలవుతుందన్నారు. టంచనుగా రైతుల ఖాతాల్లో వారి వ్యవసాయ అవసరాల నిమిత్తం డబ్బులు జమ అవుతున్నాయని, వారి సెల్ ఫోన్లకు టంగ్ టంగ్ మంటూ మెసేజులు వస్తున్నాయని చెప్పారు. 8వ విడత రైతు బంధు డబ్బులు రైతు ఖాతాల్లో నిన్నటి నుంచే జమ అవుతున్నాయని, ఖమ్మం జిల్లాలోని యసంగి కాలానికి 3,16,422 మంది రైతులకు గాను రూ.362.84 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధుతో ఇప్పటివరకు రూ. 50వేల కోట్ల నగదు రైతులకు సాయంగా అందజేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రైతుల కోసం ఇంత పెద్ద సాహసం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని అన్నారు. రైతుల పక్షాన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి జమ చేసినందుకు ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గ రైతులు, తెరాస పార్టీ నాయకులు బుధవారం వీడీవోస్ కాలనీ క్యాంపు కార్యాలయంతో పాటు రఘునాధపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారని వెల్లడించారు. యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు సాయం ఖాతా ల్లో జ‌మా అవుతుండ‌టంతో ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న‌దాత‌లు కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరభిషేకం చేస్తూ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారని అన్నారు.
== రైతుల పట్ల కేంద్రం చవితిప్రేమను చూపిస్తోంది
రైతుల పట్ల కేంద్రప్రభుత్వం చవితిప్రేమను చూపిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. రైతులు సాగు చేస్తున్న వరి పంట ధాన్యంను కొనుగోలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, ఒక రాష్ట్రాన్ని ఒకరకంగా, మరో రాష్ట్రాన్ని మరో రకంగా చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ధాన్యం కొనలేమని చేతులేత్తేస్తుందని, పైగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. కోడలకు బుద్ది చెప్పిన అత్త ఏదో చేసినట్లుగా కేంద్రప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణలో దొంగ దీక్షలు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో దీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారని, వారి ఆధ్వర్యంలో రైతుల పక్షాన కోట్లాడేందుకు మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు. రైతులు అర్థం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసానికి, మాయమాటలకు గురికావోద్దని కోరారు. ప్రతి ఒక్కరు ప్రత్యామ్నయ పంటలను సాగు చేయాలని, కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ముఖ్తకంఠంతో ఖండించాలని కోరారు.
== సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖ‌తాల్లో జ‌మా అవుతుండ‌టంతో అన్న‌దాత‌లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి జమ చేసినందుకు ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గం రఘునాధపాలెం మండ‌ల రైతుల‌తో క‌లిసి తెరాస పార్టీ నాయకులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని జిల్లా రైతాంగానికి అందిస్తూ, అన్ని వేళలా అందుబాటులో ఉంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యకు తీసుకుంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెరాస మండల అధ్యక్షుడు వీరు నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ భూక్య లక్ష్మణ్ నాయక్, pacs చైర్మన్ మందడపు సుధాకర్, సర్పంచ్ తేజవత్ రమేష్, వార్డ్ సభ్యులు లాలు, సైదులు, రైతులు రాజు, భద్రు, భూక్య లింగా, సర్వన్, భీమా తదితరులు ఉన్నారు.

also rad :-ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ : భట్టి విక్రమార్క