Telugu News

★ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలి – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

★ పురస్కారం డిమాండ్ చేస్తూ - అభిమానులు సంతకాలు సేకరణ. ★ మద్దతు తెలిపి సంతకం - చేసిన రాష్ట్ర మంత్రి పువ్వాడ.

0

★ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలి – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

★ పురస్కారం డిమాండ్ చేస్తూ – అభిమానులు సంతకాలు సేకరణ.

★ మద్దతు తెలిపి సంతకం – చేసిన రాష్ట్ర మంత్రి పువ్వాడ.

 

(ఖమ్మం – విజయంన్యూస్):- 

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు గారికి భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు డిమాండ్ చేశారు.

ఖమ్మం నగరంలో ఆదివారం జరిగిన కమ్మ వారి కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో నందమూరి తారక రామారావు గారి అభిమానులు వారికి భారత రత్న అవార్డు ప్రకటించి గౌరవించాలని సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ సందర్భంగా కమ్మ వారి వన సమారాధనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సైతం సంతకం చేశారు. తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

 

also read :-హుజరాబాద్ ఎమ్మెల్యే , ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం

also read :-కరోనా భారిన పడి : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ – శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత.

 

 


please share, subscribe, & like my channel :- smiling chaithu