Telugu News

★ రైతు బంధువు సీఎం కేసీఆర్

★ రైతన్నలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు

0

★ రైతు బంధువు సీఎం కేసీఆర్

★ రైతన్నలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు

★ నేడు జాతీయ రైతు దినోత్సవం

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. “బీడుపడ్డ తెలంగాణ పచ్చవడాలె.. అన్నదాత దేనికోసం ఆరాటపడకుండా.. గుండెలమీద చెయ్యేసుకొని ఎవుసం చేసుకోవాలె” అనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతును రాజు చేసేందుకు తగిన చర్యలు చేపట్టిందని, దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

“” సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.
అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా మిగతా 27 రాష్ర్టాల్లో ఒక్క రాష్ట్రం.. ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనడంలేదు. క్వింటాలు సంగతి పక్కన పెట్టండి, కిలో కూడా సేకరించడం లేదు. అలా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రం.ధాన్యం అమ్ముకోవాలంటే ఒకప్పుడు అరిగోస. రైతు ధాన్యాన్ని తూర్పారబట్టి బస్తాల్లో నింపుకొని వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి పడిగాపులు కాయాలి. లేదంటే ఊర్లోనే అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముకోవాలి. కాలు బయట పెట్టాలంటేనే కాంటా కూలీ, హమాలీ.. లారీ డ్రైవరు, క్లీనరూ జడుసుకుంటున్న ఈ క్లిష్ట సమయంలో తెలంగాణలో ఊరూరికీ వెళ్లి ధాన్యాన్ని కొంటున్నఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం””

“” కరోనా కాలం. సామాన్యుడు మొదలు సర్కారుదాకా అందరూ కాసుల కోసం కటకటలాడుతున్న కాలం. ఎక్కడ పైసా దొరుకుతుందా.. ఎక్కడ రూపాయి మిగులుతుందా అని ఎదురుచూస్తున్న కాలం! ఈ కరోనా కాలంలో సైతం.. ఈ కష్ట కాలంలో సైతం.. వ్యవసాయం కోసం రైతన్నకు ముందే పెట్టుబడి సాయం అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్‌””

“”మహీతలాన్ని మహమ్మారి చుట్టుముట్టి మారణహోమం సృష్టిస్తున్న రోజుల్లో సైతం అద్భుతాలు సృష్టిస్తూ.. అంచనాలకు మించి దిగుబడులు సాధిస్తూ.. 27 రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది..
ఒకే ఒక్కడు మన తెలంగాణ రైతన్న! ఈ అసాధ్యం సుసాధ్యం కావడానికి కారణమైన నికార్సైన రైతు.. అసలు సిసలు రైతు బంధువు
ఒకే ఒక్కడు కేసీఆర్‌.””

– పువ్వాడ అజయ్ కుమార్
రవాణా శాఖ మంత్రి

also read;-సలీమా కు సెల్యూట్.. ఐపీఎస్ గా  పదోన్నతి