Telugu News

★ మత సామరస్యానికి మంత్రే చిహ్నం

విజయం న్యూస్

0

★ మత సామరస్యానికి మంత్రే చిహ్నం

(విజయం న్యూస్):-

సామాజిక వ్యవస్థలో సమానత్వం, మనుషుల మధ్య, మతాల మధ్య సామరస్యం ఉండాలని కాంక్షించారు కులమతాల మధ్య భేదాలను తెంచి ధార్మిక, రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించి నూతన సమసమాజ ఒరవడికి శ్రీకారం చుట్టి నేటి ఈ కుటిల నీతి, నీచ రాజకీయాలుకు స్ఫూర్తిగా రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిలుస్తున్నారు.

మతంపేర మారణహోమం వద్దు మనకు కావలసింది మతం కాదు మానవత్వం, ప్రతివ్యక్తిలో దర్శించవలసింది దైవత్వం అది మతసామరస్యంతోనే సాధ్యమని స్పూర్తి పొంది, ఆచరించి ఖమ్మం నగరంలో మత కార్చిచ్చు రేపే కుట్ర రాజకీయాలను భగ్నం చేసి మత సామరస్యానికి ప్రతీకగా మంత్రి అజయ్ నిలిచారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నగరం, జిల్లాలోని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి తంటాలు పడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహా, సూచనలివ్వటం మానుకొని భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార దాహంతో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం గర్హనీయం. ఇదిలా ఉంటే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తరచూ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మీడియాలో కనిపిస్తామనే కుత్సిత బుద్ధి ప్రదర్శించటం సిగ్గుచేటు. నగర, జిల్లా ప్రగతి ప్రస్థానంలో ఎవరి పాత్ర ఎలాంటిదో తెలుసుకోలేని స్థితిలో ఖమ్మం ప్రజలు లేరనేది వాస్తవం.

also read :-చండ్రుగొండలో వైఎస్ఆర్ టీపీలో భారీగా చేరికలు.

ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ ప్రాంతంలో రహదారి విస్తరణ, కూడలి సుందరీకరణ దృష్ట్యా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపి అభివృద్ది చేసేందుకు కృషి చేశారు. ఓ మతానికి సంబంధించిన చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నారని ఈ సున్నిశిత ప్రాంతాన్ని ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ మత కార్చిచ్చు తో మంటలు రగిలించి రాజకీయ పబ్బం గడిపేందుకు కుటిల ప్రయత్నాలు ప్రారంభించి లబ్ధి పొందాలని యత్నించారు. అన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలిచే మంత్రి పువ్వాడ అజయ్ తన వ్యూహ చతురతతో బీజేపీ నాయకుల మత చిచ్చును చిత్తు చేశారని చెప్పవచ్చు.

also read :-ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో అస్సాం సీఎం పై భట్టి ఫిర్యాదు

ప్రశాంతమైన వాతావరణంలో చైతన్యవంతులైన ఖమ్మం ప్రజల మధ్య మతం అనే మందుతో చిచ్చు పెట్టి అగ్గి రాజేసి రాజకీయ పబ్దం గడపాలని ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కుట్ర పటాపంచలైంది. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాకచక్యం, వ్యూహ రచనతో ఆ మత కుట్రను చేదించాము. ఖమ్మం చైతన్యవంతుల జిల్లాగా పేరొందిన ప్రాంతం.. కులం మతం జాతి వర్గ విబేధాలకు తావు లేకుండా ప్రతి అంశంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతం వారికి ఆదర్శంగా నిలుస్తుంది అలాంటి ఖమ్మం లో దేశ రాజకీయాల్లో హిందూ మతం చాటున దాక్కుని రాజకీయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నక్కినక్కి చాప కింద నీరులా ప్రయాణం సాగిస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారు ‘గంగాజమునా తెహజీబ్‌’అనే సందేహాన్ని ఖమ్మం ప్రజలు ఇతరులకు అందిస్తుంటే అది చూసి ఓర్వలేక నీచ కుట్రలకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు.

ఖమ్మం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్థవంతమైన నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృధ్ది ఫలాలు అందుతున్నాయి. విభిన్న సంస్కృతులను ఆదరించిన ఖమ్మం ప్రజలకు ఈ సంకుచిత భావాలు కలిగిన మతతత్వ పార్టీ బీజేపీ సరిపోతుందా? ప్రజలు ఆలోచించాలి, చర్చించుకోవాలి. ప్రశాంతతా? అశాంతా? ఏది కావాలో తేల్చుకోవాలి. మన సోదరుల్లాగా శతాబ్దాలుగా ఇక్కడ బతుకుతున్న ఇతర మతాలవారితో విభేదాలు కావాలా? తెలంగాణ పైన చిన్నచూపు చూపిస్తూ, ఉత్తరాది ఆధిపత్యంతో తెలంగాణ రాష్ర్టాన్ని శత్రువు గా చూస్తున్న బీజేపీకి ఖమ్మం లో ఏమాత్రం చోటిచ్చినా పెద్ద ప్రమాదం. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే భయం గొలుపుతుంది. ఏ విభేదాలున్నా, ఎవరితోనైనా బ్రతకవచ్చు. కానీ, సంకుచిత స్వభావాలున్న వారితో విశాల తత్వం ఉన్న మనుష్యులు సంతోషంగా బతుకలేరు. ఆ విషయం అర్ధం చేసుకుని ఖమ్మంలో బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండి రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రశాంతత కాపాడుకోవటానికి సమాయత్తమవుదాం.