Telugu News

★ ప్రధాని మోదీకు మంత్రి పువ్వాడ ట్వీట్

ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్

0

★ ప్రధాని మోదీకు మంత్రి పువ్వాడ ట్వీట్

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తికి మీరు విరుద్ధం కానట్లైతే ఎందుకు వివక్ష చూపుతున్నారని మంత్రి ప్రశ్నించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ది చేస్తున్నపుడు వయసులో చిన్నదైన దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిచి ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష, ఉదాసీనత చూపుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రధానిని మంత్రి అజయ్ విమర్శించారు.

also read;-ఈ నెల 11 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రలో కలిపి తెలంగాణ కు తీరని అన్యాయం చేసిందని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రశ్నించే దృశ్యాలను మరియు నిధులు మంజూరు, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వివక్ష మొండి వైఖరిని ప్రశ్నిస్తూ పలు చిత్రాలను తన ట్వీట్ కు మంత్రి జత చేశారు.

ప్రధాని మోదీను “మ్యాన్ ఆఫ్ పార్షియాలిటీ” గా మంత్రి అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ వివక్షను తెలంగాణ బీజేపీ మూర్ఖులు ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డారు. తీవ్ర వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ సమతా మూర్తి స్ఫూర్తికి విరుద్ధంగా కాకపోతే మరేంటని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.