Telugu News

★ రాజమండ్రిలో మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు

★ రాజమండ్రిలో మంత్రి పువ్వాడ

0

రాజమండ్రిలో మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీమతి వసంత లక్ష్మిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఖమ్మం నగర తెరాస యువజన విభాగం అధ్యక్షుడు, సుడా పాలకవర్గ సభ్యుడు దేవభక్తుని కిషోర్ బాబు అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సుఖసంతోషాలతో జీవించాలని, జిల్లాను సుభిక్షంగా అభివృద్ది చేసే శక్తి సామర్ధ్యాలు ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, కేక్ కట్ చేసి మంత్రి పువ్వాడకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బత్తుల మురళి ప్రసాద్, పైడిపల్లి సత్యనారాయణ, కూరాకుల వలరాజు, బిక్కసాని జేశ్వంత్, పులిపాటి ప్రసాద్, కూర్ర భాస్కర్ రావు, మోతారపు సుధాకర్, అంజి రెడ్డి, సిరిపురపు సుదర్శన్, శిద్దారెడ్డి పవన్ రెడ్డి, రామోజీ, రాము, మధు, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

also read;-కారు అదుపుతప్పి ఇద్దరు దుర్మరణం..*