Telugu News

★ నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

★ కార్మికులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు

0

★ నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

★ కార్మికులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు

గోదావరి లోయలో సింగరేణి ఓ జీవనాడి.. భిన్న సంస్కృతుల వేదిక, కార్మికులు తమ చమటను సిరులుగా మలిచే అద్భుత ప్రపంచం.. పుడమితల్లి పొత్తిళ్లల్లో నిగూడంగా ఉన్న నల్లబంగారాన్ని తవ్వితీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను పంచుతున్న సిరులవేణి సింగరేణి నేడు అవిర్భావ దినోత్సవం సందర్బంగా కార్మికులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో చిక్కి శల్యమైన సంస్థ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో పునర్జీవం పోసుకొని రాష్ర్టానికే మణిహారంగా సిరులవేణి సింగరేణి.. ఊహకందని ప్రగతి సాధిస్తున్నదని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తెలంగాణ మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థ ఏటా రికార్డు స్థాయి అభివృద్ధితో ముందుకు సాగుతూ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, లాభాల్లో వాటా, కారుణ్య నియామకాలు.. ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతుదన్నారు. 49 శాతం వాటా కలిగిన కేంద్రం.. సింగరేణి నుంచి వచ్చే డివిడెంట్లు, పన్నులు తీసుకొంటూ.. ఏమాత్రం సహకరించకపోయినా సీఎం కేసిఆర్ కృషితో ఏడున్నరేండ్లలోనే రెట్టించిన అభివృద్ధి సాధించిందన్నారు. కార్మికులకు ఆదాయపన్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవటం శోచనీయమన్నారు. నేడు సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను సంస్థకు చెందకుండా వేలం ద్వారా అమ్మేసే చర్యలకు పూనుకోవడం కార్మిక వ్యతిరేక విధానం అవలంబించట మేమని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.

also read;-మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ ముట్టడి చేసిన సీపీఎం…