Telugu News

★ ఊరూరా రైతు బంధు సంబురం

★ ఖమ్మంలో వైభవంగా రైతు ఉత్సవాలు

0

★ ఊరూరా రైతు బంధు సంబురం

★ ఖమ్మంలో వైభవంగా రైతు ఉత్సవాలు

★ రైతుబంధుతో భరోసా… మంత్రి పువ్వాడ

పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. దండగ అన్న వ్యవసాయాన్ని రైతు బంధు పథకం పండుగ చేసింది. కర్షకులకు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. అప్పుల ఊబి నుంచి గట్టెక్కిచ్చింది. సాగుకు భరోసానిచ్చింది. ప్రతి సీజన్‌లో పెట్టుబడి సాయం అందుకుని రైతులు దర్జాగా సాగుకు కదులుతున్నారు. ఈ పథకానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పథకం ఆరంభం నుంచి ఈ నెల 10 లోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గంలో సంబురాలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు

 

also read :-షార్ట్ సర్క్యూట్తో యువ రైతు మృతి.

రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న – సాయికిరణ్ నేతృత్వంలో మిర్చి పంటతో “జై రైతు బంధు కెసీఆర్” అని ఆకారాన్ని రూపొందించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో మహిళలు తెలంగాణ రైతు బంధు అంటూ ముగ్గులు వేసి ముగ్ధులయ్యరు.

రైతు బంధు తోనే భరోసా….
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రైతుల్లో భరోసా కలిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వరి పంటలో పంజాబ్‌ను మించిపోవడం అసాధారణ విజయమన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో రూ.2,661 కోట్లు..

also read:-ఈనెల 4న మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన.

ఖమ్మం జిల్లాలో 2018 వానకాలం నుంచి ఈ యాసంగి సీజన్‌ వరకు రైతుల ఖాతాల్లో రూ.2,661 కోట్లు జమ అయ్యాయి. ఈ యాసంగి సీజన్‌కు జిల్లావ్యాప్తంగా మొత్తం 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల రైతుబంధు నిధులు మంజూరయ్యాయి. సోమవారం వరకు 2,60,797 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.200.17 కోట్ల సొమ్ము జమ అయింది. మిగిలిన వారి ఖాతాల్లో ఈ నెల 10 లోపు రైతుబంధు జమ కానున్నది.