అకాల వర్షం తడిసి ముద్దయిన శనగ పంట
(ఇచ్చోడ విజయం న్యూస్) :-
అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతిసింది. చేతికి వచ్చిన జోన్న, నువ్వులు, కూరగాయలు తదితర పంటలు నేలకొరిగాయి. ఇచ్చోడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉదురు గాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం కురిసింది. మండల కేంద్రంలో సుమారు గంట పాటు వర్షం కురిసింది.
also read :-ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
మండలంలో పలు చోట్ల కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని కలిగించింది. అలాగే మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోకి తీసుకొచ్చిన సెనగలు తడిసి ముద్దయి పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటకు ప్రతిఫలం వస్తుందకున్న సమయంలో ప్రకృతి కన్నెర్ర జేయడంతో రైతుకు తీరని శోకం మిగిలి మరింత అప్పుల ఊబిలోకి కురుకుపోయే పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు.