Telugu News

🔊రాష్ట్రంలో 10 కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీలు!

🔶సర్కారు ప్రతిపాదనలు పంపిన ఇంటర్ విద్యా కమిషనర్.

0

🔊రాష్ట్రంలో 10 కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీలు!

🔶సర్కారు ప్రతిపాదనలు పంపిన ఇంటర్ విద్యా కమిషనర్.

🔷విద్యా శాఖ మంత్రి నియోజకవర్గంలో ఒక కాలేజీ.

🔶స్పీకర్ నియోజకవర్గంలో ఒకటి.. ప్రభుత్వ విప్.

🔷నియోజకవర్గంలో ఒక కాలేజీ ఉన్నాయి.

🔶ఆమోదం తెలిపితే వచ్చే ఏడాది నుంచి ప్రారంభం.

 

🍥హైదరాబాద్, నవంబరు 20, ప్రభాతవార్త: తెలంగాణ రాష్ట్రంలో మరో 10 కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే వచ్చే ఏడాది నుంచి 10 కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇంటర్ విద్య కమిషనరేట్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అందులో ఒకటి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలోని జల్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపింది. మొత్తంగా సుమారు 10కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావాలని పేర్కొం టూ ఇంటర్ విద్య కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

అయితే ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఆయా కాలేజీలు ఏర్పాటు చేస్తే ఎంత మేరకు ప్రభుత్వానికి ఆర్థికభారం పడుతుంది.. అలాగే భవన నిర్మాణాలకు ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ పేర్కొంటూ విద్యా శాఖకు లేఖ రాసింది. దీంతో రాష్ట్రంలో కొత్త ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఒక్కో కాలేజీకి రికరింగ్ ఖర్చు రూ. 5 కోట్లుగా.. నార్రికరింగ్ ఖర్చుగా మరో రూ. 5 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఇంటర్ విద్య కమిషనర్ తిరిగి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

కొత్తగా ఏర్పాటు కావాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఒక కాలేజీ ఉండగా.. ప్రభుత్వ విఫ్ గొంగడి సునీత నియోజకవర్గమైన ఆలేరు నియోజకవర్గంలోని బీబీనగర్ ఒకేషనల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ప్రతిపాదనలు పంపారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గమైన ఎల్బీనగర్ నియోజకవర్గంలో రెండు కాలేజీలు, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నియోజకవర్గమైన షాద్ నగర్ నియోజకవర్గంలో మూడు చౌదర్పల్లి, కొందుర్గి, మరోచోట కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావాలని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.

ఈ 10 ప్రాంతాల్లో కూడా ఆయా కాలేజీలు ఏర్పాటయ్యే ప్రాంతానికి 25 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదని.. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులు 25 కిలోమీటర్ల దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్ విద్యను చదువుకోవల్సి వస్తుందని అందుకే తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరగా.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇంటర్ విద్య కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది 2021-22 విద్యా సంవత్సరంలో 4 కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వాటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లను తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి.

also read :- కరాటేను పాఠ్యాంశాల్లో చేర్చాలి…