Telugu News

ఖమ్మంలో 1000 కి.మీ భట్టి పాదయాత్ర సంబురం

మండే ఎండల్లో సైతం ఆగని పాదయాత్ర

0

ఖమ్మంలో 1000 కి.మీ భట్టి పాదయాత్ర సంబురం

== భట్టి ప్రతి అడుగు ప్రజా సమస్యపైనే

== మండే ఎండల్లో సైతం ఆగని పాదయాత్ర

== విజవంతంగా వేయి కిలోమీటర్లు ముగిసిన పీపుల్స్ మార్చ్

== సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కకు  అభినందనలు

== నాడు వైఎస్ఆర్ నేడు భట్టి

== ప్రతి ఆలోచనా ప్రజా సంక్షేమం కోసమే

== ఖమ్మం డిసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

== జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మధిర శాసన సభ సభ్యులుసీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజక వర్గం పిప్పిరి మండలం నుండి మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర  విజయవంతంగా వేయి కిలోమీటర్లు చేరుకుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసుకొని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జోడోయాత్ర  స్ఫూర్తితో సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలుపెట్టారని అన్నారు.

ఇది కూడా చదవండి: రైతుల హామీలను తుంగలో తొక్కిందేవరు..? :పువ్వాళ్ళ

ఖమ్మం జిల్లా వ్యక్తిగా సిఎల్పీ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున భట్టి విక్రమార్కకు ప్రత్యేక అభినందనలను తెలిపారు. ఈ నెల 25 న ఖమ్మంలోని భారీ బహిరంగ సభతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగుస్తుందని ప్రతి కార్యకర్త సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులుతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అతిరథ మహారథుల ఈ సభలో పాల్గొనున్నారని తెలిపారు. రాష్ట్ర ఆదివాసీ  సంఘం అధ్యక్షులు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ..మల్లు భట్టి విక్రమార్క కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీ లను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడానికే తప్ప పంచాయతీ ల అభివృద్ధికి నయా పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పంచాయతీలను ఆదివాసి తండాలను సుందరంగా తీర్చిదిద్దుకుంటామని

అన్నారు.అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… భట్టి విక్రమార్క కు అభినందనలు తెలియజేశారు. బూత్ స్థాయిలో ఉమ్మడి జిల్లా 7 నియోజక వర్గాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. ఎల్డీఎంలో భాగంగా ఎల్డీఏం  రాష్ట్ర ఆదివాసీ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ కమిటీ లు వేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ స్ఫూర్తితో భట్టి విక్రమార్క పాదయాత్ర తో ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్నారని ఆయన పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం కాంగ్రెస్ అధ్యక్షులు రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర  ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు బెల్లయ్యా నాయక్ పాల్గొని లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ పై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఇదికూడా చదవండి: కుల వృత్తులందరికి ఆర్థిక సాయం అందజేయాలి: జావిద్

బూత్ స్థాయిలో తండాలో కమిటీలను ముమ్మరం చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అన్ని విధాల కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు,అదేవిధంగా ఆదివాసీ సంఘం లో పని చేయుటకు ఆసక్తి ఉన్న ఆదివాసి నాయకులు వారి బయోడేటా లను జిల్లా ఆదివాసీ అధ్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్ కు అందజేయాలని పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు,వడ్డే నారాయణరావు,పుచ్చకాయల వీరభద్రంరాష్ట్ర ఎస్టీ సెల్ నాయకులు బానోత్ రాజు నాయక్,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు వేగినాటి ఉదయ్మాజీ కార్పొరేటర్, బ్లాక్ అధ్యక్షులు బాలగంగాధర్ తిలక్,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు దుద్ధుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి,వైరా ఎల్ డీఎం కో ఆర్డినేటర్ మద్దినేని రమేష్, మాజీ జడ్పీటీసీ పసుపులేటి దేవేంద్రం, నల్లమల సత్యంబాబుపొదిల హరినాధ్,పాలేటి నరసింహారావు, మల్లెల అజయ్జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు గజ్జెల్లి వెంకన్నవైరా మండల పట్టణ అధ్యక్షులు శీలం వెంకటనర్సిరెడ్డి,ఎదునూరి సీతారాములుజిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పమ్మి అశోక్,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్ భోజడ్ల సత్యనారాయణ,నగర ఓబీసీ ,సేవాదళ్,మైనారిటి, ఎస్టీ సెల్స్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, ఎస్టీకే అబ్బాస్ భాయ్,శంకర్ నాయక్, ఎస్ డీ గౌస్,తవిడబోయిన రవిరామూర్తి నాయక్,కాళంగి కనకరాజువినోద్, బిక్షపతి రాథోడ్, రాంబాబు,మంగీలాల్ నాయక్, బండి నాగేశ్వరావు,రియాజ్, ముజాహిద్దీన్,వాసిమ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: మైనారిటీ లకు 12% రిజర్వేషన్ కల్పించాలి: జావిద్