Telugu News

రూ. 100తో 24 గంటలు ప్రయాణించండి||

(హైదరాబాద్-విజయం న్యూస్)

0

రూ. 100తో 24 గంటలు ప్రయాణించండి||

(హైదరాబాద్-విజయం న్యూస్)
◆ తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు.

◆ నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీని లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత..సంస్థల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

◆ బస్సుల్లో సాధారణ ప్రయాణీకుడిలా ప్రయాణించి…సమస్యలు తెలుసుకోవడం..బస్టాండుల్లో అకస్మిక తనిఖీలు చేయడం…పలు ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

◆ ఆర్టీసీ ఎండీగా వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటూ..అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆర్టీసీని సంస్థను లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే…

◆ ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్న సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

◆ కేవలం రూ. 100 చెల్లించి..హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించారు.

◆ పెరుగుతున్న పెట్రోల్ ధరల క్రమంలో..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..ఆర్టీసీ బస్సులు ఉన్నాయంటూ వెల్లడించారు.

◆ టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు.

◆ ఈ టికెట్ ధర రూ. 100గా ఉందని..ఈ టికెట్ ను తీసుకుని…ఆర్డినరీ, సబ్ ర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చన్నారు.

◆ ఈ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చని ఆయన సూచించారు. దీనివల్ల ప్రయాణీకులకు మరింత సౌకర్యం కల్పించినట్లవుతుందని భావిస్తున్నారు.