Telugu News

ఖమ్మం పట్టణంలో రెచ్చిపోతున్న దొంగలు

ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు

0

ఖమ్మం పట్టణంలో రెచ్చిపోతున్న దొంగలు

== ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు

== వరస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తం

(ఖమ్మం-విజయంన్యూస్)

దొంగలు రూట్ మార్చారు.. అర్థరాత్రి ఒంటరి నివాస ఇండ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు చేసే దుండగులు మోటర్ సైకిళ్ల తో వచ్చి పట్టపగలే ఒంటరిగా నడిచే మహిళల మెడలో ఉన్న గొలుసులను చోరి చేసే పరిస్థితి వచ్చింది.. అప్పటికి పోలీసులు పట్టుకుంటున్నారనే ఆలోచనతో అప్ డేట్ అయిన పోలీసులు రూట్ మార్చారు. పల్లెటూర్లను కాకుండా పట్టణాలను, ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా నేత్రాలున్నప్పటికి ఎలాంటి వణుకుబెణుకు లేకుండా దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు.

ALLSO READ- కేశ్వాపురం సర్పంచ్ మృతి

== ఖమ్మం నగరంలో

పట్ట పగలే వరుస దొంగతనాలతో హడలెత్తుతున్నారు స్థానికులు.. ఖమ్మంలో ప్రతిరోజు ఏదో ఒక చోట చైన్  స్నాచింగ్లు జరగడం పరిపాటిగా మారింది. మొన్నటికీ మొన్న కాల్వొడ్డులో వృద్ధురాలు మెడలో గొలుసు దొంగిలించిన ఘటన మరువకముందే తాజాగా నగరంలోని కమాన్ బజార్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి జొరబడి మెడలో ఉన్న దాదాపు ఐదు తులల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దుండగుడు.కమాన్ బజార్ లో నివాసం ఉంటున్న గార్లపాటి జగన్ ఇంట్లో తల్లి శారద మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లాడు. గొలుసు విలువ సుమారు 2లక్షలు ఉంటుందని  అంటున్న వృద్ధురాలి బందువులు. కేసు నమోదు చేసి సి సి ఫుటేజ్ ఆధారంగా వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.