జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి
==లేదంటే ఆందోళన తప్పదు
== టియుడబ్ల్యూజె ఐజెయు రాష్ట్ర కార్యదర్శి విరహత్ఆలీ
== సమస్యల పరిష్కారానికి కార్యాచరణ : రాంనారాయణ
== టియుడబ్ల్యూజె ఐజెయులో భారీ చేరికలు
ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్ 19(విజయంన్యూస్):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియుడబ్ల్యూజె ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహస్ఆలీ హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల పాలక వర్గాలు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని ఆయన ఆరోపించారు. టియుడబ్ల్యూజె ఐజెయు ఖమ్మంజిల్లా విస్తృత స్థాయి సమావేశం బుధవారం స్థానిక కోణార్క్ , హోటల్ లో జరిగింది.
ఇది కూడా చదవండి: “దళితబంధు” రాజకీయ ఎత్తుగడేనా..?
జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విరహ ఆలీ మా
ట్లాడుతూ సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందించడంలో వివక్ష ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తొలి దశలోనే జర్నలిస్టులకు అందించేందుకు టియుడబ్ల్యూజె ఐజెయు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా అక్రిడేషన్ల విషయంలో కొందరు డిపిఆర్‌వోలు వ్యక్తిగత వ్యవహరంగా భావిస్తూ అర్హులైన జర్నలిస్టులకు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులను అందించాలని విరహస్ఆలీ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల నివాస స్థలాల గురించి అనేక దశాబ్దాలుగా పోట్లాడుతున్నామని అయినా ప్రభుత్వాల్లో కదలిక లేదని ఇటీవల సుప్రీంకోర్టు కూడా సానుకూల తీర్పును ఇచ్చిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని ఆయన కోరారు. కొన్ని సంఘాలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని కానీ టియుడబ్ల్యూజె ఐజెయు నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రైల్వేపాసుల విషయంలో కూడా కేంద్రమంత్రిని కలిసి సానుకూల ఆదేశాలు వచ్చే విధంగా చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో సరైన రీతిలో అమలు జరగడం లేదని విరహత్ అలీ తెలిపారు. ఐజెయు ఆధ్వర్యంలో త్వరలోనే జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, జీవితబీమా, ఆరోగ్య బీమా లాంటి వాటిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ఐజెయు ఏకైక ఎజెండా అన్నారు.
== సమస్యల పరిష్కారానికి కార్యాచరణ : రాంనారాయణ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి గత అనేక సంవత్సరాలుగా విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని ఆందోళన కార్యాచరణను ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు అందడం లేదని హెల్త్ కార్డులు నాలుక గీసుకునేందుకు కూడా పనికి రావడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం పక్షాన ఆరోగ్య బీమా, ఇండ్ల స్థలాలు, ఇండ్ల సాధన కోసం బహుముఖ పోరాటాలను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో నవంబరు మొదటి వారం తర్వాత ఖమ్మంజిల్లాలో సానుకూల ప్రకటనలు రాని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామన్నారు. జర్నలిస్టులు సైతం వృత్తి నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. జర్నలిస్టు హక్కులను సాధించి పెట్టడంలో టియుడబ్ల్యూజె ఐజెయు ముందు వరుసలో నిలిచిందని సుదీర్ఘ చరిత్ర కలిగిన సంఘం మున్ముందు కూడా సమస్యల పరిష్కారానికి పోరాట మార్గాన్ని ఎంచుకుంటుందని రాంనారాయణ తెలిపారు.
ఇది కూడా చదవండి: పత్రాలేందుకు..? పైసలీవ్వూ..?
== టియుడబ్ల్యూజె(ఐజెయు)లో భారీ చేరికలు
== వివిధ సంఘాల నుండి పలువురు జర్నలిస్టులు విరహఅలీ సమక్షంలో చేరిక
ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్ 19(విజయంన్యూస్): తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజెయు)లో పెద్ద సంఖ్యలో సభ్యులు చేరారు. బుధవారం ఖమ్మంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి విరహ స్ఎ
లీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ సమక్షంలో పలువురు జర్నలిస్టులు సంఘంలో చేరారు. నామ పురుషోత్తం, యలమందయ్య, శ్రీనివాస్ తదితరులతో కలిసి 30 మంది టీయుడబ్యూజె టిజెఎఫ్ సంఘం నుంచి ఐజెయులో చేరారు. అదేవిధంగా సూర్య దినపత్రిక నుంచి పగడాల మధు, మేడి రమేష్, వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితరుల ఆధ్వర్యంలో 25 మంది జర్నలిస్టులు విరహఅలీ, రాంనారాయణ సమక్షంలో ఐజెయులో చేరారు. గండారపు రామారావు, చల్లా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది జర్నలిస్టులు ఐజెయు నేతల సమక్షంలో సంఘంలో చేరారు.
ఇది కూడ చదవండి: నేలకొండపల్లి మండలంలో మహిళపై బీఆర్ఎస్ నేత దాడి
ఈ సందర్భంగా విరహ 1లీ, రాంనారాయణ మాట్లాడుతూ వివిధ సంఘాల నుండి ఐజెయులో చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పోరాడదామన్నారు. ప్రభుత్వ పథకాలైన దళితబంధు సహా వివిధ పథకాలను అర్హులైన వారికి అందించాలనే డిమాండ్తో పోరాట కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజెయు జాతీయ సమితి సభ్యులు అమరవాది రవీంద్రశేషు, టియుడబ్ల్యూజె ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సంఘ బాధ్యులు సర్వనేని వెంకట్రావు, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి శివానంద, ఆవుల శ్రీనివాసరావు, కనకం సైదులు, మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాసరావు, వై. మాధవరావు, ఎస్కీ ఖాదర్ బాబా, ఎస్సీ మోహినుద్దీన్, ఎన్. -వెంకట్రావు, సత్యనారాయణ, నామ పురుషోత్తం, మధు, మేడి రమేష్, పలువురు జిల్లా ఆఫీస్ బేరర్లు, వివిధ నియోజక వర్గాల బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.