Telugu News

అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి.

విచారణ చేపట్టిన తల్లాడ పోలీసులు

0

అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి

== విచారణ చేపట్టిన తల్లాడ పోలీసులు 

(రిపోర్టర్: విజయ్)

తల్లాడ సెప్టెంబర్ 2 (విజయం న్యూస్):
తల్లాడ మండల కేంద్రంలోని మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ నందు అనుమానాస్పద రీతిలో వ్యక్తి మరణించాడు. తల్లాడ మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన పంతగాని జోజి వికలాంగుడు మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ నందు నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి విధులకు హాజరైన జోజి శుక్రవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది వచ్చి చూడగా అనుమానాధస్పద రీతిలో మృతి చెంది కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసి మృతికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. మృతునికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. మృతుడు వికలాంగుడైన వాచ్మెన్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు