Telugu News

ఎన్ జి టి ఆదేశాలతో క్రషర్ జాయింట్ కమిటీ విచారణ

కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ నావెల్ కపూర్, రాష్ట్ర అధికారి కృపాకర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్,

0

ఎన్ జి టి ఆదేశాలతో క్రషర్ జాయింట్  కమిటీ విచారణ

== కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ నావెల్ కపూర్, రాష్ట్ర అధికారి కృపాకర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్

ఏన్కూరు, అక్టోబర్ 21(విజయం న్యూస్): ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామంలోని క్రషర్ మిల్లులపై వచ్చిన ఫిర్యాదులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలతో జాయింట్ కమిటీ శుక్రవారం విచారణ చేసింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ నావెల్ కపూర్, రాష్ట్ర అధికారి కృపాకర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, ఇతర అధికారులతో కూడిన జాయింట్ కమిటీ గార్లఒడ్డులోని క్రషర్ మిల్లుల ప్రాంతాన్ని పరిశీలించింది. గార్లఒడ్డు గ్రామానికి చెందిన అభిలాష్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రిబ్యునల్ కు క్రషర్ మిల్లులపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కమిటీ విచారణ చేసింది.

allso read- వన దేవతల ను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి సతీమణి.

క్రషర్ మిల్లుల నిర్వహకులను, చుట్టుపక్కల రైతులను, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. సర్వే నంబర్, పట్టా భూమి, మిల్లుల నిర్వహకులు, మైనింగ్ నిబంధనలు, లీజు సమయం, చెల్లించే విధానం తదితర వాటి గురించి విచారణ చేసి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విపి గౌతమ్ విలేకరులతో మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో విచారణ చేశామని, అందరి అభిప్రాయాలను తీసుకున్నామని, విచారణ నివేదికను జాతీయ హరిత ట్రిబ్యునల్ కు అందజేయడం జరుగుతుందని, వారు దీనిపై తగిన నిర్ణయాన్ని తదుపరి వెల్లడిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎఫ్డీఓ మంజుల, ఆర్డిఓ సూర్యనారాయణ, సర్పంచ్ భూక్య క్రాంతి బాలాజీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, ఉప సర్పంచ్ పఠాన్ మజీద్ ఖాన్, తాసిల్దార్ ఖాసిం, ఎండిఓ అశోక్, ఎఫ్ ఆర్ వో అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

allso read- ఖమ్మం నగరంలో ఏసీబీ రైడ్.