Telugu News

112 కోట్ల కేంద్ర నిధులను ప్రక్కదారి పట్టించిన కేసీఆర్ సర్కార్.

నిధుల దారి మళ్లింపు వల్ల 90,000 మంది గ్రామీణ యువత ఉపాధి కోల్పోయారు.

0

112 కోట్ల కేంద్ర నిధులను ప్రక్కదారి పట్టించిన కేసీఆర్ సర్కార్.

నిధుల దారి మళ్లింపు వల్ల 90,000 మంది గ్రామీణ యువత ఉపాధి కోల్పోయారు.

గ్రామీణ నిరుద్యోగ యువత పాలిట శాపంగా మారిన తెరాస సర్కార్.

నిరుద్యోగులకు తెరాస ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి.

ఈ నిధుల మళ్లింపు పై త్వరలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం.

బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి వెల్లడి.

తెలంగాణలో గ్రామీణ యువతకు శిక్షణ మరియు ఉపాధి కల్పించి నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కేంద్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన క్రింద తెలంగాణకు 215 కోట్ల నిధులు విడుదల చేయగా ఇందులో నుండి 112 కోట్ల నిధులను కేసీఆర్ సర్కార్ ప్రక్కదారి పట్టించిందని, ఈ నిధుల మళ్లింపు వల్లనే 90 వేల మంది గ్రామీణ యువత శిక్షణకు నోచుకోకుండా ఉపాధి కోల్పోయినారని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో 20 లక్షల మంది నిరుద్యోగ గ్రామీణ యువత చదువుల్లో ఉత్తీర్ణత పొందని వారికి వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం చేపట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన బృహత్తర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు.

also read :-విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి:ఎంపిపి బోడ మంగీలాల్ నాయక్.

ఈ నిధులు 2019-2023 కాలానికి 90,000 మందికి గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు కేంద్రం తరపున 60% వాటా అయితే రాష్ట్రం తరపున 40% వాటా నిధులతో సంయుక్తంగా కేటాయించుకుంటూ గ్రామీణ యువతకు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలతో కూడిన వృత్తి శిక్షణ ఇచ్చి వారికి తగిన ఉద్యోగాలు కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇక్కడ కేంద్రం ఇచ్చే 60% వాటా నిధులు సెప్టెంబర్, 2019 లో 215 కోట్ల నిధులు విడుదల చేయగా, తెరాస ప్రభుత్వం 143 కోట్ల నిధులు వాటికి సమకూర్చాల్సి ఉండగా, వాటిని ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులలో 112 కోట్ల నిధులు కేసీఆర్ సర్కార్ తమ సొంతానికి వాడుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాదని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ఇచ్చిన ఈ నిధులను ప్రక్కదారి పట్టించడమే కాకుండా మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ కేంద్రం పై నిందలు వేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని, అలాగే కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ఆ తప్పులను తప్పించుకోవడానికి ఇతరుల మీదకు రుద్దడం ఒక అలవాటుగా మారిందని మహేందర్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు.

also read :-రాష్ట్రీయ హిందూ సేన జిల్లా అధ్యక్షులు గా బొంతల కళ్యాణ్ చంద్ర..

ఇప్పటికైనా దారి మళ్లించిన 112 కోట్ల కేంద్ర నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 143 కోట్ల నిధులతో కలిపి మొత్తం 255 కోట్ల నిధులను తక్షణమే చెల్లించి 90,000 మంది గ్రామీణ యువతకు న్యాయం చేసి వారిని నిరుద్యోగులుగా మారకుండా వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ, కేసీఆర్ సర్కార్ వెంటనే యువతకు క్షమాపణ చెప్పాలని, అలాగే మీ ఒంటెద్దు పోకడలతో గ్రామీణ నిరుద్యోగుల పాలిట శాపంగా మారకుండా ఉండాలని కోరుతూ, లేని పక్షంలో ఈ నిధుల మల్లింపు పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరించారు.