Telugu News

యాదాద్రిలో 10 వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం : సీఎంకేసీఆర్..*

యాద్రాద్రి దేవాలయంను సందర్శించిన కేసీఆర్

0

 

*యాదాద్రిలో 10 వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం : సీఎంకేసీఆర్..*

(యాదాద్రి-విజయం న్యూస్)

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆల‌య అభివృద్ధి పనులతోపాటు, ప‌రిస‌రాల‌న్నింటినీ ప‌రిశీలించారు. టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్ద… మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి… కేసీఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని.. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ తెలిపారు

also read :- యాదాద్రికి మొదటి దాతగా కేసీఆర్

యాదాద్రి: సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మీడియాతో

మాట్లాడుతున్నారు. యాదాద్రిలో 2022 మార్చి 28న మహాకుంభ సం‍ప్రోక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. తొమ్మిది రోజుల ముందు మహా సుదర్శన యాగంతో అంకురార్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు, చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో ఈ యాగం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విశిష్ట పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటని కొనియాడారు. జోగులాంబ ఆలయం గొప్ప శక్తిపీఠమని, కృష్ణా పుష్కారాలను జోగులాంబ ఆలయం వద్ద ప్రారంభించానని తెలిపారు.

 

‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైంది. సామాజిక వివక్షే కాకుండా.. ఆధ్యాత్మిక వివక్షకు గురైంది. ఒకప్పుడు పుష్కరాలు కూడా నిర్వహించేవారు కారు. ఉద్యమ సమయంలో నేను ప్రశ్నిస్తే పుష్కరఘాట్లు నిర్మించారు. 50 ఏళ్ల కిందటే యాదాద్రి వచ్చాను. 1969లో తిరుమల వెళ్లాను. యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. వసతి సదుపాయం కోసం టెంపుల్‌ సిటీని అభివృద్ధి చేశాం. టెంపుల్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు చేపట్టాం. 100 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చక్కగా జరిగింది.’ అని తెలిపారు.

Also read :- అబ్బురపరుస్తున్న యాదాద్రి పోటోలు