Telugu News

మైనారిటీ లకు 12% రిజర్వేషన్ కల్పించాలి: జావిద్ 

0

మైనారిటీ లకు 12% రిజర్వేషన్ కల్పించాలి: జావిద్ 

== ఖమ్మం నగరం లో భారీ బైక్ ర్యాలీ

 == డీఆర్ఓ కు వినతి పత్రం అందజేసిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొహమద్ జావిద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నియోజకవర్గం తుమ్మల గడ్డ మసీదు వద్ద నుంచి ఈరోజు ఖమ్మం నగర మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్బాస్ బెగ్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ జెండా ఉపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఖమ్మం నగర అధ్యక్షుడు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేసిందన్నారు. మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ పదేళ్లలో రూ.1200 కోట్లు ఖర్చు చేసిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో మైనారిటీ సంక్షేమానికి రూ.12 వేల కోట్లు కేటాయించిందని ఇఫ్తార్ పార్టీలో కేసీఆర్ పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్ పరంగా మైనారిటీలకు నిధుల కేటాయింపును సమీక్షించాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి: సోనియమ్మతోనే ప్రత్యేక తెలంగాణ సాకారం: జావిద్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ రూ.85,000 కోట్లు. నేడు రాష్ట్ర బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి బడ్జెట్ రూ.5.56 లక్షల కోట్లు. తెలంగాణ జనాభాలో మైనార్టీలు 14 శాతం ఉన్నారని, అయితే బడ్జెట్‌లో కేవలం రూ.2,200 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. మైనారిటీ సంక్షేమంపై కేసీఆర్ నిజంగా సీరియస్ గా ఉంటే మొత్తం బడ్జెట్ లో 14 శాతం మైనార్టీ సంక్షేమానికి కేటాయించి ఉండాల్సింది. ఇఫ్తార్‌లో ముస్లింల చెవులు రిక్కించే ప్ర‌య‌త్నం చేసి జాతీయ రాజ‌కీయాల్లో పాలుపంచుకోవాల‌న్న అజెండాను ప్ర‌వేశ‌పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు కల్పిస్తున్న 4శాతం రిజర్వేషన్లను 3శాతానికి కుదించినా నేటికీ అధికారికంగా స్పష్టత రాలేదన్నారు. మైనార్టీల విద్య, ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్‌ తీసుకుంటున్న చర్యలను కొనసాగించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు మ్మిదేళ్లుగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాల అమలు నిలిచిపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయడం వల్ల చాలా మైనారిటీ కాలేజీలు మూతపడ్డాయి. మహ్మద్ జావేద్ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో ముస్లింలు విద్యాపరంగా, ఆర్థికంగా పెద్దఎత్తున నష్టపోయారని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.

ఇదికూడా చదవండి: *ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు:జావిద్

ఇస్లామిక్ సెంటర్ కు నేటికీ భూమి కేటాయించలేదన్నారు. అజ్మీర్‌లో రుబాత్‌ నిర్మాణం, దర్గా జహంగీర్‌ పిరాన్‌ అభివృద్ధి హామీలు నెరవేరలేదు. కెసిఆర్ ప్రభుత్వం మైనారిటీ లకు 12% శాతం రిజర్వేషన్ కల్పించాలి అని కోరుతూ ఖమ్మం నగరం లో భారీ బైక్ ర్యాలీ చేపట్టి  ఖమ్మం నూతన్ కాలెక్టరెట్ వరకు ర్యాలీ ద్వారా వెళ్లారు అనంతరం డిర్ఓ కి వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో నగర సేవా అధ్యక్షులు సయ్యద్ గౌస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమూద్, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ బిహెచ్ రబ్బాని, సీనియర్ నాయకులు ముజాహిద్, వసీం, ఇబ్రహీం, జానీ, జాఫర్, బుడన్, రియాజ్, మునీర్, సర్దార్, కార్పొరేటర్లు మళ్లీ వెంకటేశ్వర్లు, పలువైన చంద్రం తదితరులు పాల్గొన్నారు