Telugu News

వికలాంగులకు రూ.6వేలు పెంచి పింఛన్ ఇవ్వాలే

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం : అధ్యక్షులు గడ్డం ఖసిం

0

వికలాంగులకు రూ.6వేలు పెంచి పింఛన్ ఇవ్వాలే

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం : అధ్యక్షులు గడ్డం ఖసిం .
(ఖమ్మం-విజయంన్యూస్)
టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సదస్సులో వీహెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం ఖసిం , ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ , మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జాకోబ్ పాల్గొన్నారు . అనంతరం వారు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు పెంచాలని , వికలాంగులు బంధువు ప్రకటించాలని , ప్రతి వికలాంగులకు ఇల్లు నిర్మాణం కొరకు 5 లక్షలు మంజూరు చేయాలని , ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు ప్రకటించాలని , 2016 వికలాంగుల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాలకీటి సీతారాములు , జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిబండ్లసురేష్ , విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి శీను , మహిళా అధ్యక్షురాలు నాజియ , రాష్ట్ర మహిళా నాయకురాలు చంద్రిక , జిల్లా మహిళ అధికార ప్రతినిధి ఉప్పలమ్మ , జిల్లా నాయకులు ఇనప ఉపేందర్ , నంద్యాల వెంకట్ , రాంబాబు , వెంకయ్య , నాగేశ్వరరావు , రామారావు , రోజా రాణి , తిరుపతమ్మ , కిరణ్ , జిల్లా కమిటీ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు .

ఇది కూడా చదవోచ్చు..:- లండన్ లో  ఘనంగా దసరా ఉత్సవాలు…