Telugu News

ఏన్కూరులో 11 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు అరెస్ట్

0
11 కేజీల గంజాయి పట్టివేత
– ఇద్దరు అరెస్ట్ఏన్కూరు, అక్టోబర్ 19(విజయం న్యూస్): అక్రమంగా తరలిస్తున్న 11 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సంఘటన ఇది. వివరాలు ఎలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఎస్ఐ సాయికుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో భద్రాచలం నుంచి హైదరాబాద్ కు ఇద్దరు వ్యక్తులు తమ బైకులపై వస్తున్నారు. వారి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 11 కేజీల గంజాయి పట్టుబడింది. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని, రెండు బైకులను సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు.