Telugu News

టీఎస్ సీపీ జీఈటీ-2021లో 4i స్టాటిస్టిక్స్ విద్యార్థుల ప్రతిభ

అభినందించిన కోచింగ్ సెంటర్ అధ్యపకులు 

0

టీఎస్ సీపీ జీఈటీ-2021లో 4i స్టాటిస్టిక్స్ విద్యార్థుల ప్రతిభ

— అభినందించిన కోచింగ్ సెంటర్ అధ్యపకులు 

(ఖమ్మం-విజయం న్యూస్)

పీజీ స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ టెస్టులో ఖమ్మం నగరంలోని 4i స్టాటిస్టిక్స్ ఎంఎస్సీ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు డైరెక్టర్ పడకండ్ల గురు బ్రహ్మచారి తెలిపారు. గురు అకాడమీకి చెందిన గుర్రం సాహిత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సీటు, స్టేట్ 7 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. సీటు సాధించిన సాహితను ఏఎస్వో మల్లిఖార్జున్ , ఏఎస్వో రామ కృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. కోచింగ్ ప్రారంభించిన మూడు సంవత్సరాలలో వరుసగా స్టేట్ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని డైరెక్టర్ గురుబ్రహ్మచారి పేర్కొన్నారు. టీఎస్ సీపీ జీఈటీ-2022 మెగాడెమో నవంబర్ 7 ఆదివారం నూతన బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డైరెక్టర్ కోరారు. ఇతర వివరాలకు ఫోన్ లో 9700033396 సంప్రదించాలన్నారు.

ALSO READ:- విధినిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు:డీజీ