Telugu News

14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు

ప్రకటించిన ఎస్పీ

0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు

(భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి-విజయం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ గురువారం కొత్తగూడెం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. వీరంతా చర్ల మండలం ఎర్రం పాడు, రాళ్ల పురం, రామచంద్రాపురం, కృష్ణాపురం, బుర్రకథ పాడు గ్రామాలకు చెందినవారని ఎస్పీ ప్రకటించారు.