Telugu News

14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు

14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు

0

14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు

== చంద్రబాబుకు షాక్..

== 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు

 == రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశం

== హైకోర్టులో లంచ్ మోషన్ వేస్తున్నట్లు చెబుతున్న చంద్రబాబు తరుపు అడ్వికేట్లు

== 45ఏండ్ల రాజకీయ జీవితంలో ఫస్ట్ టైమ్ జైలుకు

== క్షణం..క్షణం ఉత్కంఠ మారిన చంద్రబాబు అరెస్ట్

== కన్నీంటిపర్వంతమైన  చంద్రబాబు కుటుంబం

== ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు..

(అమరావతి-విజయంన్యూస్)

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు(థర్డ్ అడిషనల్ సెషన్స్) షాక్ ఇచ్చింది.. 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ రాజమండ్రి జైలుకు తరలించాలని న్యాయమూర్తి హిమబిందు తీర్పు ప్రకటించారు. దీంతో చంద్రబాబును భారీ పోలీస్ భద్రత నడుమ విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నందున ఆయన్ను సబ్ జైలుకు బదులుగా సెంట్రల్ జైలుకు తరలించాల్సి వచ్చిందని అడ్వికెట్ జనరల్ తెలిపారు. అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో తెలుగుతమ్ముళ్లు షాక్  గురైయ్యనట్లు తెలుస్తోంది.. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. మరో వైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. కోర్టు అవరణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసిన పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులను హౌజ్ అరెస్టులు చేస్తున్నట్లు సమాచారం.

== స్కీల్ డెవలఫ్ మెంట్ స్కామ్ లో అవినీతి మచ్చ

చంద్రబాబు ఏపీ సీఎంగా పనిచేసిన సమయంలో స్కిల్ డెవలఫ్ మెంట్ పథకంలో భాగంగా రూ.330 కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో గత రెండేళ్ల క్రితం కేసు నమోదైంది. అందులో ఏ35 గా చంద్రబాబు పేరును నమోదు చేసింది. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో విచారణ చేపట్టిన సీఐడీ అనేక సాక్షులను, ఆరోపణలు ఎదుర్కోంటున్న వారందర్ని విచారణ చేపట్టిన సీఐడీ గత రెండు రోజుల క్రితం మరో చార్జ్ షీట్ విడుదల చేసింది. అందులో చంద్రబాబును ఏ1గా చేర్చడం, ఆ తరువాత కొద్ది గంటల్లోనే  అందుకు ప్రధాన నిందితుడుగా చంద్రబాబు అనుమానిస్తూ సీఐడీ శనివారం తెల్లవారుజామున నంద్యాలలో విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్

చాలా చేపు విచారణ చేసిన అనంతరం కొద్ది నిమిషాలలోనే అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సీఐడీఅధికారులు ఆ తరువాత నంద్యాల నుంచి 23గంటల 55 నిమిషాల తరువాత విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు.  అయితే అడుగడుగున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కోర్టు కు తీసుకెళ్లున్న కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారిపై బేటాయించారు. టైర్లను కాల్చారు. దీంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే చంద్రబాబు స్వయంగా నాయకులతో మాట్లాడి రోడ్డును ఖాళీ చేయాలని, కాన్వాయ్ కి దారి ఇవ్వాలని, ఒపిక పట్టాలని, దేవుడు మనకు న్యాయం చేస్తాడని చంద్రబాబు చెప్పారు. దీంతో కార్యకర్తలు రోడ్డు ఖాళీ చేయడంతో కాన్వాయ్ ప్రారంభమై విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తారని అందరు భావించారు. కానీ సిట్ ఆఫీస్ కు తరలించి అక్కడ గంటల తరబడి విచారణ చేశారు. అనంతరం 23గంటల 55 నిమిషాలకు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరిచారు. దీంతో సుమారు 8గంటల పాటు వాదనలు నడిచాయి.  చంద్రబాబు తరుపున సుఫ్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూథ్రా వాధించగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపునా  అదపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు వెంకటేశ్ తదితరులు వాధించారు.  సుమారు 15 మంది చొప్పున న్యాయవాదులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు అనేక అంశాలపై సుదీర్ఘ స్థాయిలో వాధనలను వినిపించారు. స్వయంగా చంద్రబాబు వాధించుకున్నారు. నాడు స్కిల్ డెవలఫ్ మెంట్ స్కీమ్ అమలు చేసిన తీరును న్యాయమూర్తికి వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు తరుపు న్యాయవాది   మొత్తం విచారణ చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు తీర్పు ప్రకటించేందుకు 4గంటల సమయం తీసుకున్నారు. .

== చంద్రబాబు రిమాండ్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విజవాడ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకటించారు. కోర్టు న్యాయమూర్తి హిమబిందు 10గంటల పాటు సాగిన వాదనల అనంతరం ఆమె ప్రకటన చేశారు. 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్  విధించినట్లు  న్యాయమూర్తి తీర్పును ప్రకటించారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ మేరకు పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, దారి పోడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన టీడీపీ నాయకులను హౌజ్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

== గవర్నర్ అనుమతి లేదన్న ప్రభుత్వ తరుపు న్యాయవాది

చంద్రబాబు నాయుడు కేవలం మాజీ ముఖ్యమంత్రి మాత్రమేనని, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమేనని ప్రభుత్వ తరుపు న్యాయవాది ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు వివరించారు.మాజీ ముఖ్యమంత్రి అనేది హోదా మాత్రమేనని, కేసుకు విచారణకు ఉపయోగపడదన్నారు. ప్రోటోకాల్ లేదని,ప్రివిలెజ్ లేదని, అరెస్ట్ చేయాలనుకుంటే స్పీకర్ కు చెబితే సరిపోతుందన్నారు. గవర్నర్ కు మూడు నెలల వ్యవధిలో ఎప్పుడైనా సమాచారం అందించవచ్చని అన్నారు. అరెస్టు చేసిన తరువాత 24గంటల వ్యవధిలో కోర్టులో హజరుపరుస్తామని తెలిపారు.

== సీఐడీ పై చంద్రబాబు తరుపు న్యాయవాధి ఆగ్రహం

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని చంద్రబాబు తరుపు న్యాయవాధి లూథ్రా కోర్టుకు వివరించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని, దురుద్దేశంతో నమోదు చేసినందనేనని కోర్టుకు వివరించిన లూథ్రా, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును చేర్చలేదని వివరించారు. పోలీసులు సమర్పించిన 28 రిమాండ్ రిపోర్టులో ఈ ఆరోపణలకు సంబంధించిన చంద్రబాబుపై మొత్తం 34 సెక్షన్ల కిందా అభియోగాలను నమోదు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు పై రిమాండ్ రిపోర్టలో పేర్కొన్న 409 సెక్షన్ పై ఏసీబీ కోర్టులో లూథ్రా తీవ్రస్థాయిలో వాధించారు.  నంద్యాలలో అరెస్టు చేసినప్పటికి సమీపంలోని కోర్టులో హాజరుపర్చవచ్చని, కానీ దానికి బదులుగా 24గంటల పాటు నిర్భందించిన విధానం, ఆయనపై పోలీసులు వ్యవహారించిన తీరు కరెక్ట్ కాదని అన్నారు. సీఐడీ ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు లండన్ వెళ్లే షెడ్యూల్ ఏది లేదని, అది సాకుగా చూపించి అరెస్ట్ చేయడం సరైంది కాదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తప్పని సరి అని, కానీ సీఐడీ అధికారులు గవర్నర్ అనుమతులు తీసుకోకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

== ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు..సంబరాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తున్నారు.. 14 రోజుల జుడీషయల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో తెలుగురాష్ట్రాలకు చెందిన టీడీపీ శ్రేణులు, నాయకులు ఆందోళనకు గురైయ్యారు. వారు షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. 40ఏళ్ల చరిత్రలో ఎన్నడు లేని విధంగా మచ్చలేని మనిషిగా రాజకీయం చేసిన చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికలకు కొద్ది రోజుల సమయంలోనే సీఐడీ అరెస్ట్ చేయడం, ఏసీబీ కోర్టులో షాకింగ్ తీర్పురావడంతో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. చాలా చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ఇక మరో వైపు వైసీసీ శ్రేణులు  సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

== 45ఏండ్ల రాజకీయ చరిత్రలో

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ శక్తిగా ఎదిగారు. 9ఏళ్ల పాటు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 10ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా పనిచేసిన చంద్రబాబు, ప్రస్తుతం ఏపీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు మచ్చకనిపించని నాయకుడిగా దేశంలో పేరోందారు. కంప్యూటర్ పరిజ్జానంతో రాజకీయ చాణిక్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓ స్కిల్ డెవలఫ్ మెంట్  పథకంలో అక్రమాలు చేసినట్లు నింధారోపణలతో 14రోజుల పాటు జైలు జీవితం గడిపే పరిస్థితి రావడం గమనర్హం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి 14 రోజుల పాటు జైలుకు పంపించడం అశ్ఛర్యకరమైన విషయం.

== పెళ్లి రోజు జైలుకు

చంద్రబాబు నాయుడు తన పెళ్లిరోజున జైలుకు వెళ్తుండటం గమనర్హం. చంద్రబాబు, భువనేశ్వరితో సెప్టెంబర్ 10న వివాహం జరిగింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ భువనేశ్వరితో కలిసి ఇంట్లోనే ఉంటూ సంబరాలు చేసుకుంటారు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా పెళ్లి రోజున చంద్రబాబు, భువనేశ్వరి విడిపోయి లేరంటా..? కానీ ఈ ఏడాది సెప్టెంబర్ 10 వారిద్దరికి చికటి రోజుగా మారింది. ఉదయం నుంచి ఏసీబీ కోర్టులోనే ఉండగా, భార్య భువనేశ్వరి కన్నీటిపర్వంతమైయ్యారు.