Telugu News

ముస్లిం మైనర్టీలకు 15 సీట్లు కేటాయించాలి: జావిద్

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కు వినతి చేసిన ముస్లీం,మైనార్టీలు

0

ముస్లిం మైనర్టీలకు 15 సీట్లు కేటాయించాలి: జావిద్               

== స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కు వినతి చేసిన ముస్లీం,మైనార్టీలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల నిర్ణయాత్మక శక్తి వుంది, జిల్లా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ పంపిణీలో న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ మైనారిటీ నేతలు మురళీధరన్ కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంలో మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యుడు బాబా సిద్ధిఖీలను కాంగ్రెస్ మైనార్టీ నేతలు కలిశారు. తెలంగాణ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు అజ్మతుల్లా హుస్సేనీ, ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్, ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉబైదుల్లా కొత్వాల్, నగర్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ జావేద్‌, గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీతో ప్రొఫెసర్‌ రియాజ్‌ అహ్మద్‌,   మహ్మద్‌ అయూబ్‌, మహ్మద్‌ జహీర్‌లు కలిశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ తల్లి సోనియమ్మ: పొంగులేటి 

తెలంగాణలో మైనారిటీ జనాభా దాదాపు 14 శాతం ఉందని, అందులో ముస్లిం మైనారిటీలు 12 శాతం ఉన్నారని కమిటీకి వివరించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణలోని మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు మైనార్టీల విశ్వాసం పొందాలంటే టిక్కెట్ల పంపిణీలో మైనార్టీ ప్రజాప్రతినిధులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా ముస్లిం నేతలు టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని కమిటీకి సమాచారం అందించారు. ముఖ్యంగా ఖమ్మం నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్‌లోని మైనారిటీ జనాభా నియోజకవర్గాల నుంచి టికెట్లు అభ్యర్థించారు. ప్రతి ఎన్నికల్లోనూ ముస్లింలకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇస్తున్నారని, అయితే నిక్కచ్చిగా బి ఫామ్ పంపిణీ చేసే సమయంలో ముస్లిం నేతలకు అన్యాయం జరుగుతోందని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ముస్లింలకు మరిన్ని టిక్కెట్లు కల్పించేందుకు సానుభూతితో పరిశీలిస్తామని కమిటీ చైర్మన్ మురళీదరన్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: 14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు