15 నుంచి ఒంటిపూట బడులు
(విజయం న్యూస్);-
రాష్ట్రంలో ఈ నెల 15 వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది . 1 నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ నెలాఖరు రోజు చివరి పనిదినంగా , అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఎస్ సీఈఆర్టీ గతంలో క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే
also read;--న్యాయవాదిపై టీఆర్ఎస్ , ఎమ్మెల్యే అనుచరుల దాడి
గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటి పూట బడులు జరిపారు . అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి . ఈ నేపథ్యంలో కాస్త ముందుగానే 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది .
also read;-రైతు బంధు రైతులను ముంచే పథకం
ఈ అంశంపై వివిధ శాఖలతోపాటు విద్యాశాఖ అభిప్రాయాన్ని తీసుకుని ప్రకటించనుంది . గతేడాది ఒంటి పూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించి , ఆ తరువాత మధ్యాహ్న భోజనం అందించారు . ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహించాలని , అలాగే పరీక్షలకు కనీసం పది రోజుల ముందుగానే సిలబస్ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది . తద్వారా విద్యార్థులకు మరోసారి రివిజన్ చేసుకునే సమయం ఉంటుంది . అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్- 3 పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులు జరగనున్నట్లు సమాచారం .