Telugu News

మా పైసలేప్పుడిస్తరు సారూ..?

చిన్నగూడూరు మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ఆందోళన

0

మా పైసలేప్పుడిస్తరు సారూ..?

== చిన్నగూడూరు మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ఆందోళన

(మహుబూబాబాద్ -విజయంన్యూస్)

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఉపాధి హామిలో అక్రమాలు జరిగాయంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితుల ఆందోళన చేపట్టారు. పని చేయని వారికి ఉపాధి హామిలో డబ్బులు చెల్లించి పని చేసిన వారికి మొండి చెయ్యి చూపారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న బాధితులను పంచాయితీ కార్యదర్శి వీడియో తీస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈతతంగానికి ఉపాధి హామీ కంప్యూటర్ ఆపరేటర్,మరియూ చిన్న గుడూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి ప్రధాన సూత్రధారులని ఆరోపించారు. పని చేయని వారి ఖాతాల్లో పంచాయితీ కార్యదర్శి లక్షల్లో డబ్బులు జమ చేసారని అనంతరం వాటాలు పంచుకున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శి,కంప్యూటర్ ఆపరేటర్ అవినీతి భాగోతనికి వత్తాసు పలుకుతూ సహకరిస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారిని పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: రాజీవ్ హత్యకేసు సుప్రీంకోర్టు సంచలన తీర్పు