Telugu News

సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొంగులేటి*

పూజలో పాల్గొన్న కుటుంబసభ్యులు

0

*సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొంగులేటి*

★★ పూజలో పాల్గొన్న కుటుంబసభ్యులు

(కాణిపాకం-విజయంన్యూస్):

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఇటీవల వారి కుమార్తె వివాహం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

allso read:- ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గ్రీన్ సిగ్నల్

ఈ సందర్భంగా ఆలయ పూజారులు …. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులతో పాటు స్వామిని దర్శించున్నవారిలో వారి సోదరులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి దంపతులు, వియ్యంకులు రామసహాయం రఘురామిరెడ్డి, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు పొంగులేటితో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు.