Telugu News

తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు

ఖమ్మం కోర్టులో లొంగిపోయిన ‘ఆ ఇద్దరు’

0

తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు

== ఖమ్మం కోర్టులో లొంగిపోయిన ‘ఆ ఇద్దరు’

== మరో నింధితుడు కూడా లొంగుబాటు

== 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు

== సీపీఎం నేతలను ఊళ్లోకి రానివ్వమని నిన్న ధర్నా చేసిన తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబ సభ్యులు, మద్దతుదారులు

== మరసటి రోజునే కోర్టులో లొంగిపోయిన ప్రధాన నింధితులు

(ఖమ్మం రూరల్-విజయంన్యూస్)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఊహించని విధంగా కేసు నమోదులో కనిపించిన ఆ ఇద్దరు రిమాండ్ రిపోర్టులో పేర్లు లేకపోవడంతో హాట్ టాఫిక్ గా మారిన ఈ కేసు విషయం ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మలుపుతిరిగింది. ప్రధాన నిందితుడిగా ప్రచారం జరుగుతున్న తమ్మినేని కోటేశ్వరరావు, వెల్లంపల్లి నాగయ్యలు ఇప్పటి వరకు పరారిలో ఉండగా  శుక్రవారం  ఖమ్మం కోర్టులో లొంగిపోయారు.

ఇది కూడా చదవండి: తెల్దారుపల్లిలో ఆగని ఆందోళనలు

ఈ మేరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వళ్లే ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను అదే గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగస్టు 15న అతీ కిరాతకంగా హత్యచేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. స్వాతంత్ర దినోత్సవం రోజున 75 సంవత్సాలు పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న సంబరాలు జరుగుతున్న తరుణంలో హఠన్మారణ సంఘటన జరిగింది. జెండాను అవిష్కరించి ఇంటికి వెళ్తున్న తమ్మినేని కృష్ణయ్యను ఆ గ్రామానికి చెందిన కొంత మంది  సీపీఎం కార్యకర్తలు అతికిరాతకంగా వేటకొడవళ్లతో దాడి చేసి హత మార్చారు. దీంతో ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీస్ శాఖ అప్రమత్తమైంది.. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేసింది. భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. అయినప్పటికి గ్రామస్థుల ఆగ్రావేశాలకు ఆ బందోబస్తు, సెక్షన్లు ఆగలేదు. తమ్మినేని కృష్ణయ్య హత్యకు ప్రధాన కారణం తమ్మినని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరావు అని భావించిన గ్రామస్థులు ఆయన ఇంటిపై దాడి చేసి దుగ్గుదుగ్గు చేశారు. ప్యాక్టరీని తగలబెట్టారు. కాగా తమ్మినేని కృష్ణయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తమ్మినేని కోటేశ్వరరావు, ఎస్.కె.రంజాన్, వెల్లంపల్లి నాగయ్యలతో పాటు మరో 7 పేర్లతో కేసు నమోదు చేశారు. అనంతరం పరారిలో ఉన్నవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టి మొత్తానికి నాలుగు రోజుల తరువాత వారిని కోర్టుకు రిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: పాలేరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం       

ఎల్లంపల్లి నాగయ్య పేర్లు లేకుండా మరో 8మంది పేర్లతో రిమాండ్ రిపోర్టును కోర్టులో సడ్మిట్ చేసి ఆ ఎనిమిది మంది కోర్టులో రిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున విమ్మర్శలు వచ్చాయి. అసలైన నిందితులను వదిలేసి ఎవర్ని ఉద్దరిద్దామని మీడియా ప్రతినిధులు పత్రికలు, న్యూస్ చానళ్లలో ప్రశ్నించింది. ప్రజల నుంచి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమ్మర్శలు రావడంతో పోలీసులు ఆలోచించి వారిద్దర్ని రిమాండ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

== సీపీఎం నాయకులను ఊళ్లోకి రాకుండా బహిష్కరిస్తామంటున్న గ్రామస్థులు

తమ్మినేని కృష్ణయ్య హత్యకు కారణమైన సీపీఎం పార్టీ నాయకులను తెల్దారుపల్లి గ్రామంలోకి రానిచ్చేది లేదని తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు, వారి మద్దతు దారులు గ్రామస్థులు గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం నాయకులు గ్రామంలోకి వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న కృష్ణయ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో గ్రామస్తుల మద్దతతో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం-హైదరాబాద్ ప్రధాన రహధారిపై ధర్నా చేయాలని నిర్ణయించి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ బస్వారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. చివరి సీపీఎం నాయకులను ఊళ్లోకి రానీవ్వబోమని హామినిచ్చిన తరువాత ఆందోళన విరమించారు. అయితే సీపీఎం నాయకులను ఊళ్లోకి రానివ్వమని, బహిష్కరిస్తామని చెప్పడంతో సీపీఎం పార్టీ ఆగ్రనాయకత్వానికి ఇబ్బంది అయినట్లుగా భావించి కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

== కోర్టులో లొంగిపోయిన ఆ ఇద్దరు

తమ్మినేని కృష్ణయ్యను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ప్రచారం జరుగుతున్న తమ్మినేని కోటేశ్వరరావు, వెల్లంపల్లి నాగయ్యలు శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. వారు ఇద్దరు పోలీస్ బందోబస్తుగా కోర్టుకు వచ్చి జడ్జి ముందు హాజరుకాగా, విచారణ చేసిన జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ కు తరలిస్తున్నట్లు తీర్పు చెప్పారు. దీంతో ఈ కేసులో కొత్త మలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తునప్పటికి కొంత అనుమానాలైయితే ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధుల ఆదేశాల మేరకే తమ్మినేని కోటేశ్వరారావు లొంగిపోయారే ప్రచారం జరుగుతుంది.. చూద్దాం రాబోయే రోజుల్లో గ్రామంలో మరేన్ని ములుపు తిరుగుతుందో..? వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: ఆసరాతో ముసలవ్వల మోమున ముసిముసి నవ్వులు : కందాళ