Telugu News

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు  కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల వివరాలు:

18వ తేదీ - జిల్లా కలెక్టర్ల సమావేశం:

0

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు  కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల వివరాలు:

18వ తేదీ – జిల్లా కలెక్టర్ల సమావేశం:
———————————————–
ఈ నెల 18న, దళిత బందు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు.

దళితబంధు అమలుపై సమీక్షించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాలో అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో మార్చిలోపు అమలుచేసే అంశంపై సీఎం సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు శిక్షణాకార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ అంశంపై సీఎం సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు.

19వ తేదీ – వనపర్తి జిల్లా పర్యటన:
————————————————
ఆదివారం, 19వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

20వ తేదీ – జనగామ జిల్లా పర్యటన:
————————————————
సోమవారం, 20వ తేదీన జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం శ్రీ కేసీఆర్ ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

వీటితో పాటు ముఖ్యమంత్రి త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. జిల్లాల పర్యటన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి.

➧ ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపట్టనున్నారు. ఆ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 100 పడకల దవాఖానను ప్రారంభించనున్నారు.

➧ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

➧ జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

➧ యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

➧ వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

also read :-చర్ల ఆసుపత్రికి చరిత్ర ఎంతో ఘనం – భవిష్యత్తు అంధకారం.