,బాధిత కుటుంబానికి అండగా నిలిచిన 2009 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీఐ కుటుంబానికి 29 లక్షలు అందజేసిన సీఐలు
,బాధిత కుటుంబానికి అండగా నిలిచిన 2009 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీఐ కుటుంబానికి 29 లక్షలు అందజేసిన సీఐలు
స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన మధిర సిఐ ఓ మురళి
భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన 2009 సర్కిల్ ఇన్స్పెక్టర్ల బ్యాచ్
?స్నేహ ధర్మం పాటించే అవకాశం వచ్చిన సందర్భంలో స్పందించి ముందు నిలవడం ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా స్నేహితుడి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలవడం స్నేహానికి మరింత విలువను ఇస్తుంది. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాఘవేందర్ గౌడ్ మరణించిన విషయం తెలిసిందే. 2009 బ్యాచ్ కు చెందిన రాఘవేందర్ మరణం అతని కుటుంబ సభ్యులతో పాటుగా, ఒకే శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన నేస్తాలకూ తీవ్ర ఆవేదన కలిగించింది.
also read :-మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి
ఇటువంటి విషాద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని తలచిన బ్యాచ్ మేట్స్, తామంతా కలిసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు జమ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న (1103) రాఘవేందర్ స్నేహితులు అనుకున్నదే తడవుగా ఈ డబ్బును జమ చేస్తూ, తమకు దూరమైన స్నేహితుడి పిల్లల భవిష్యత్తు కొరకు ఆ కుటుంబానికి అందజేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఏకాదశ దిన కర్మ రోజున ఈ డబ్బును రాఘవేందర్ కుటుంబానికి అందయజేయడం జరిగింది. గతం లోను ఏలూరు రేంజ్ లో చనిపోయిన ఇద్దరు ఆఫీసర్స్ కి (55) లక్షలు వరకు, హైదరాబాద్ రేంజ్ లో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ గా పని చేసి గత సంవత్సరం అబ్దుల్లాపుర్ మెట్ రోడ్డు ప్రమాదం లో చనిపోయిన లక్ష్మణ్ పిల్లలకు (45) లక్షలు వరకు రెండు రాష్ట్రాలు లో పనిచేస్తున్నా 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమం లో 2009 బ్యాచ్ సభ్యులు పాల్గొనడం జరిగింది..సబ్ ఇన్స్పెక్టర్లు 2009 బ్యాచ్