Telugu News

అసలు రాహుల్ ఎవరు..? సీఎంలు ఎందుకు సంబోదిస్తారు..?

ఆయన చరిత్ర ఏంటీ..?

0

అసలీ రాహుల్ ఎవరు..? సీఎం పదేపదే ఎందుకు రాహుల్ అని అంటా‌రు..

సీఎం ప్రతి ప్రెస్ మీట్ లో మారుమోగుతున్న పేరు రాహుల్

(హైదరాబాద్ -విజయం న్యూస్):

ప్రగతి భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకర్లను ఉద్దేశించి అనేక మార్లు ఉచ్చరించిన పేరు “రాహుల్”..ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన పలకరించే పేరు.. అరిచే పేరు.. ప్రశ్నించే పేరు “రాహుల్”. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా అనేక మార్లు ఈయన్ని కేసీఆర్ పలకరిస్తుంటాడంటే వీరికున్న పలుకుబడి ఎంటీ..? ప్రతి ప్రెస్ మీట్ లో మారు మోగే పేరు వెనకాల కథ ఏంటీ..? వివరాలు చూద్దాం.

హైదారాబాద్ జర్నలిస్ట్ సర్కిల్ లో మంచి పేరున్న రాహుల్ సీనియర్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్. ఆయన ఎప్పటి నుండో “హిందూ” పేపర్ లో సీనియర్ పాత్రికేయునిగా పని చేస్తున్నారు., మాజీ ముఖ్యమంత్రుల దగ్గర నుండి దాదాపు సీనియర్ రాజకీయ నాయకులందరికి వీరు సుపరిచితులే….

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో రాహుల్ చాలా సన్నిహితంగా ఉండేవారు., అయినా రాజశేఖరరెడ్డిని ఒక్క సహాయం కూడా అడగలేదని చెప్తుంటారు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కు రాహుల్ స్వయానా క్లాస్ మేట్ అంటా., .వీరిద్దరూ హైదారాబాద్ లో ఒకే కాలేజ్ లో కలసి చదువుకున్నారట, వ్యక్తిగతంగా రాహుల్ అందరితో కలివిడిగా ఉంటారని తోటి పాత్రికేయులు చెప్తుంటారు. ఎందరో సీఎంలను చూసిన ఆయన ప్రతి ఓక్కరితో సన్నిహితంగా ఉండేవారు. అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క పైరవీ చేసుకున్నవాడు కాదంటా.. ముక్కుసూటీగా మాట్లాడం.. ముక్కుసూటిగా ప్రశ్నించడం.. ముక్కుసూటిగా రాయడం ఆయన నైజం.. ఎవరికి భయపడడంటా..? ఒకానోక దశలో సీఎం గా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు చాలా అర్థికపరమైన అవసరం వచ్చిందంటా.. ఆయన బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఎం వైఎస్సార్ ఆ డబ్బును ఇంటికి పంపించారంటా..? కానీ రాహుల్..అదే కవర్ ను మరసటి రోజున సీఎం టేబుల్ పై ఉండటంతో సీఎం వైఎస్ఆర్ ఆశ్ఛర్యపోయాడంటా..

all so read:- తోటి జవాన్ ల పై కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

నల్లారికిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు క్లాస్ మెంట్ .. రూమ్ మెంట్.. ప్రాణ స్నేహితుడు కావడంతో పదవి ఇవ్వాలని భావించి సీఎం అడిగితే నిర్థాక్ష్యణంగా రిజక్ట్ చేశారంటా..? అలాగే రాహుల్ ఒక రోజు రోడ్డుపై నడుసుకుంటూ వెళ్తున్న సమయంలో అటుగా వెళ్తున్న సీఎం కేసీఆర్ ఆయన్ను చూసి కారు ఆపి పిలిచి కారేక్కమంటే సున్నితంగా తిరస్కరింతారంటా..? సీఎం లే స్వయంగా డబ్బులిచ్చిన.. పదవులు ఇస్తనన్న.. కారులో ఎక్కించుకుంటామంటే వద్దనే వారుంటారా..? కానీ జర్నలిస్ట్ రాహుల్ మాత్రం సున్నితంగా రిజక్ట్ చేశారంటే ఆయన్ను ఏమనాలి.. ఆయన నేటికి బీదవారేనంటా..? ఐంయమంది సీఎంలతో పరిచయాలుండి.. అంత పెద్ద పేపర్ లో పనిచేసే రాహుల్ ఎందుకు అంత బీదవాడిగా ఉన్నారు..  ఆయన గారిని ఏమనాలి..? ఎంతమందికి ఆదర్శం.. అలాంటి జర్నలిస్ట్ లు ఎంత మంది ఉన్నారు.. హెట్సాఫ్ రాహుల్..

All so read :- తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు